Thursday, May 16, 2024
- Advertisement -

హీరోయిన్ కాదు.. ఈ సారి విలన్ గా.. అంటున్న కాజ‌ల్

- Advertisement -
kajal agarwal doing villain role in her next movie

తెలుగు, తమిళ పరిశ్రమలో స్టార్ హీరోల అందరి సరసన నటించింది అందాల భామ కాజ‌ల్ అగ‌ర్వాల్. టాలీవుడ్, కోలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మెగా ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చిన హీరోయిన్‌గా కాజ‌ల్ ముద్ర వేయించుకుంది.

మెగా ఫ్యామిలీలో బన్నీతో.. ఆర్య‌-2, ఎవ‌డు.. రామ్ చరణ్ తో మ‌గ‌ధీర‌, గోవిందుడు, నాయ‌క్.. పవన్ సరసన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల్లో నటించిన ఈ సుందరి.. తాజాగా మెగాస్టార్ చిరు కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమాలో కూడా నటించింది. ఖైదీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వ‌సూళ్లు సాధిస్తోంది. ఈ నెపథ్యంలో ఈ సక్సెస్ ను అభిమానులతో పంచుకోంటున్న ఆమె త‌న ట్విట్ట‌ర్‌లో చిట్ చాట్ చేసింది.

ఈ చిట్ చాట్‌లో ఆమె మెగాస్టార్ చిరుతో న‌టించ‌డం త‌న‌కు మ‌ర్చిపోలేని అనుభూతి అని తెలిపింది. ఖైదీలో నటించడం తనకు కేరీర్ ప‌రంగా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింద‌ని చెప్పిన కాజ‌ల్ త‌న డ్రీమ్ రోల్ ఏంట‌న్న ప్ర‌శ్న‌కు షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది. తన పదేళ్ళ కెరీర్‌లో కాజల్ సరదాగా సాగిపోయే యువతి పాత్రలే చేయడం తప్ప ఎప్పుడూ విలన్ తరహాలో ఎప్పుడూ నటించలేదు… ఫ్యూచ‌ర్‌లో త‌న‌కు నెగిటివ్ రోల్ చేయాల‌ని ఉంద‌ని ఆమె చెప్పింది. మరి కాజల్ కు ఏ దర్శకుడు విలన్ రోల్ ఇస్తాడో చూడాలి.

Related

  1. అప్పుడే.. ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్!
  2. బ్రహ్మానందంకు మళ్లీ లైఫ్ ఇచ్చిన మెగాస్టార్!
  3. తమిళ స్టార్ హీరో తో స్టార్ హీరో భార్య రొమాన్స్!
  4. పవన్ కళ్యాణ్ కి మామగా సూపర్ స్టార్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -