ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు ఓ రేంజ్‌లో వచ్చిన విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ సైతం ఎన్టీఆర్, మహేష్‌ను పక్కన పెట్టి పవన్ కోసం అదిరిపోయే కథ రెడీ చేస్తున్నాడని కూడా టాక్ కూడా వినిపించింది.
పవన్ కు 2019 ఎన్నికల నాటికి త్రివిక్రమ్ చిత్రం ఎంతో ఉపయోగపడుతుందని ..ఆ రేంజ్‌లో త్రివిక్రమ్ స్టోరీ రెడీ చేస్తున్నాడన్న వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు కాటమరాయుడులో నటిస్తున్న పవన్ ఈ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నీసన్ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేయడం..ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం కూడా జరిగిపోయాయి. ఈ చిత్రంను ఖుషీ, బంగారం సినిమాలను నిర్మించిన ఏఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది.
మరి పవన్ ప్రాజెక్టు నుంచి సడెన్‌గా త్రివిక్రమ్ పేరు ఎందుకు మాయమైంది అన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అసలు మ్యాటర్ ఏంటంటే మహేష్ 25వ సినిమాను డైరెక్ట్ చేయాలని త్రివిక్రమ్ ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నాడట. ఈ విషయం తెలిసిన పవన్ ఇక త్రివిక్రమ్‌తో లాభం లేదనుకుని నీసన్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సో అలా పవన్ త్రివిక్రమ్‌కు షాక్ ఇచ్చాడన్న టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.
Related