Thursday, May 2, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ స్నేహితుడుగా సునీల్!

- Advertisement -

ప్రస్తుతం పవన్ డాలీ దర్శకత్వంలో కాటమ రాయుడు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత పవన్ మాటల మాంత్రికుడు తో మూవీ చేయనున్నారు. కాటమ రాయుడు షెడ్యూల్ గ్యాప్ లో రెండో చిత్రానికి డేట్స్ కేటాయించారు.

నవంబర్ లో 15 రోజులపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో పని చేయనున్నారు. దీంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హారికా హాసిని క్రియేషన్స్ వారు పనులను మొదలెట్టేసారు. “దేవుడే దిగి వచ్చినా..” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయడంతో పాటు ఆర్టిస్టుల ఎంపికను చక చక చేస్తున్నారు. తాజాగా ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ పాత్రకు సునీల్ ని ఎంచుకున్నట్లు తెలిసింది. హాస్య నటుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సునీల్.. హీరోగా ఎదిగాడు. మర్యాద రామన్న, పూల రంగడు వంటి విజయాలను సొంతం చేసుకున్నాడు.

తర్వాత ఆయన హీరోగా చేసిన చిత్రాలన్నీ ఆశించినంతగా విజయం సాధించక పోవడంతో మళ్లీ పాత పద్ధతిని ఫాలో అయిపోతున్నాడు. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ద్వారా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. పవర్ స్టార్ పక్కన పంచ్ లు పేల్చడానికి ఎప్పుడూ ఆలీ ని ఎంచుకునేవారు. ఈ సారి సునీల్ ఆ ఛాన్స్ కొట్టేసాడు. ఈ చిత్రం ద్వారా సునీల్ ని మళ్లీ కమెడియన్ గా బిజీ చేసేందుకు త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం.

Related

  1. పవన్ వల్ల మహేష్ సినిమాకి కష్టాలు!
  2. పవన్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?
  3. కొరటాల డైరెక్షన్లో ముఖ్యమంత్రిగా పవన్ సినిమా!
  4. పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళు వీళ్ళే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -