Tuesday, April 30, 2024
- Advertisement -

భారీగా రేటు పెంచిన బుట్టబొమ్మ !

- Advertisement -

‘మాస్టర్’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్న దళపతి విజయ్ ప్రస్తుతం మాంచి జోష్ లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకెళుతున్న ఈ హీరో మరో సినిమాను తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మాస్టర్ తర్వాత ఈ హీరో విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విజయ్ దళపతి 65 వ సినిమాగా తెరకెక్కనుంది.

కాగా అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో ఉండబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ దళపతి సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుందంటూ ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ కన్నడ చిన్నది అవుట్ అయ్యిందన్న వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా విజయ్ దళపతికి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో నటించడానికి ఈ అమ్మడు ఏకంగా 3.50 కోట్లను డిమాండ్ చేసిందని సమాచారం. ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించ లేదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా కొనసాగుతున్న ఈ చిన్నది అంత భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చెయ్యడంలోపెద్ద ఆశ్చర్యమేమీ లేదంటూ నెటిజన్లు అంటున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు !

అయ్యయ్యో.. బాలయ్యకు ఏంటీ ఈ కష్టాలు !

అప్పుల్లో నాల్గో స్థానంలో ఏపీ

‘గజకేసరి’ గా దూసుకొస్తున్న యశ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -