Monday, April 29, 2024
- Advertisement -

అప్పుల్లో నాల్గో స్థానంలో ఏపీ

- Advertisement -

దేశంలోని వివిధ రాష్ట్రాల‌తో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పులు భారీగా పెర‌గిపోతున్నాయ‌ని తాజ‌గా విడుద‌లైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ద్వారా వెల్ల‌డ‌వుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల్లో నాలుగో స్థానంలో నిచిలిన‌ట్టు కాగ్ నివేదిక వెల్ల‌డించింది. కాగ్ నివేదిక‌లోని మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి.

2020-21 ఆర్థిక సంవత్సరంలో పది నెలల లెక్కలను కాగ్ విడుద‌ల చేసింది. అందులో ఈ జ‌న‌వ‌రి వ‌ర‌కు ఏపీ రూ. 73,912.91 కోట్లను అప్పుల రూపంలో ఏపీ నిధుల‌ను స‌మ‌కూర్చుకున్న‌ట్టు వెల్ల‌డించింది. 2010-20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలఖారు వరకు ప్ర‌భుత్వ ఖ‌జనా రాబడులు రూ. 85,987.04 కోట్లుగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.88,238.70 కోట్ల రాబడి ఉంది.

గత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు నాటికి రూ.46,503.21 కోట్ల రుణ‌భారంలో ఉంది. ఇప్పుడది ఏకంగా రూ. 73,912.91 కోట్లకు చేరింది. ఈ ఏడాది అప్పు అంచనాతో పోలిస్తే ఇది 153 శాతం అధికంగా పెరిగింది. రాష్ట్రంలో ఖర్చు చేస్తున్న ప్రతి 100 రూపాయల్లో రూ. 45 అప్పుగానే సమకూర్చుకున్నట్టు కాగ్ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.

రెక్వెస్ట్ కాదు.. వార్నింగ్ : బండి సంజయ్

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -