Wednesday, April 24, 2024
- Advertisement -

‘గజకేసరి’ గా దూసుకొస్తున్న యశ్ !

- Advertisement -

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ సినిమాతో దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు వ‌చ్చింది. అన్ని ప్రాంతాల్లోనూ ఆయ‌న మార్కెట్ ఈ సినిమాతో ఏర్ప‌ర్చుకున్నారు. తెలుగు నాట కూడా ఆయ‌న మ‌స్తు క్రేజ్ ల‌భించింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మ‌రో సినిమాతో తెలుగు వెండితెర‌పై దూసుకొస్తున్నాడు. అదే ‘గ‌జ‌కేస‌రి’ అంటూ గ‌ర్జిస్తూ మార్చిలో ప‌లు తెలుగు హీరోల‌తో పోటీ ప‌డ‌బోతున్నాడు.

కేజీఎఫ్ సినిమాతో య‌శ్‌కు తెలుగులో మంచి క్రేజ్ ల‌భించింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఇదివ‌ర‌కు న‌టించిన సినిమాల‌ను తెలుగు లో డ‌బ్బు చేసి విడుద‌ల చేయ‌డానికి డబ్బింగ్ నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే య‌శ్ న‌టించిన నాలుగైదు సినిమాలు తెలుగులోకి డ‌బ్ అవుతున్న‌ద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే 2014లో య‌శ్ హీరోగా వ‌చ్చిన క‌న్న‌డ‌ మూవీ గ‌జ‌కేస‌రిని తెలుగులో విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఈ నెల 5న య‌శ్ గ‌జ‌కేస‌రి విడుద‌ల కానుంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఈ సినిమా గురించి పెద్ద‌గా తెలియ‌లేదు. కానీ తాజాగా ఈ చిత్రం ప్ర‌క‌ట‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక 2014లో వ‌చ్చిన ఈ సినిమా అప్ప‌ట్లోనే బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగించింది. ఏకంగా రూ.40 కోట్లను వ‌సూలు చేసింది ఈ చిత్రం. మ‌రి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏ స్థాయిలో అల‌రిస్తుందో చూడాలి మ‌రి.

రెక్వెస్ట్ కాదు.. వార్నింగ్ : బండి సంజయ్

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -