Friday, April 26, 2024
- Advertisement -

వకీల్ సాబ్ కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాల పరంగా ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. వ్యక్తిగతంగా కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా కలెక్షన్స్ మాత్రం విపరితంగా వస్తాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడంతో సినిమాలకు దూరమైయ్యాడు. కానీ మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకున్నాడు. అందుకే రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు.

హిందీ పింక్ రిమేక్ గా వకీల్ సాబ్ మూవీలో ప్రస్తుతం పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా వరకు షూటింగ్ కంప్లిట్ చేసుకుంది. కరోనా ఎఫెక్ట్ తో మిగిత షూట్ ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది. ఇక వకీల్ సాబ్ కోసం ప్రత్యేక విమానంలో రోజూ షూటింగ్ కి తీసుకొచ్చి తీసుకెళ్లేవారని టాక్ కూడా అప్పట్లో వచ్చింది. ఇక రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ముట్టజెప్పడానికి ప్రొడ్యూసర్స్ క్యూ కట్టినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఫైనల్ గా ‘వకీల్ సాబ్’ సినిమాను నిర్మించే బాధ్యతలు దిల్ రాజు తీసుకున్నాడు. దీనితో దిల్ రాజుకు పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా తీయాలని కోరిక కూడా నెరవేరింది.

మనకందుతున్న సమాచారం ప్రకారం వకీల్ సాబ్ లో నటిస్తున్నందుకు పవన్ 25 కోట్లకు పైనే తీసుకున్నాడని టాక్. సినిమా రిలీజ్ ముందు జరిగే మార్కెట్ లోనుంచి మరో 25 కోట్లకు కూడా పవన్ కే ఇవ్వనున్నట్టు టాక్. అంటే వకీల్ సాబ్ సినిమాకు గాను పవన్ కు మొత్తం రూ.50 కోట్లు అందుకోబోతున్నట్లు సమాచారం.

Also Read

షార్ట్ ఫిలిమ్స్ తో పరిచమైన నటీనటులు..!

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -