Tuesday, May 21, 2024
- Advertisement -

రైల్వే స్టేషన్ విలన్ల చితకబాదిన పవన్!

- Advertisement -
currently pawan kalyan in fighting mode

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. దర్శకుడు డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేరే ఏ సినిమా షూటింగ్ లు పెట్టుకోకుండా ఈ కాటమరాయుడు పైనే దృష్టి పెట్టారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ రూపొందించిన ప్రత్యేకమైన రైల్వే స్టేషన్ సెట్టింగ్లో ఓ భారీ పైటింగ్ సీన్స్ షూట్ చేస్తున్నారట. ప్రముఖ స్టంట్ కోరియేగ్రాఫర్లు అయిన రామ్-లక్ష్మణ్ లు ఈ పోరాట సన్నివేశాన్ని కంపోజ్ చేస్తున్నారట.

సినిమాలో కీలక సమయంలో వచ్చే ఈ ఫైట్ పవన్ అ భిమానులను తెగ అలరించనుందట. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తిగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. తమిళంలో అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతీహాసన్ హీరోయిన్ గా నటించనుంది.  ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తో పవన్ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టనున్నాడో  చూడాలి.

Related

  1. 2000 నోటుని పరిశీలిస్తున్న పవన్!
  2. తన మనుషులను భీమవరం పంపిస్తున్న పవన్ కళ్యాణ్..
  3. పవన్ కు ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్లు!
  4. సుమకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పవన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -