Friday, May 17, 2024
- Advertisement -

జియోకి షాక్ ఇచ్చిన కేంద్రం!

- Advertisement -
central government penalty on jio group

ముఖేష్ అంబానీ ఏ టైంలో జియో వెల్ కం ఆఫ‌ర్ ప్రకటించాడో గాని  ఇండియ‌న్ టెలికం రంగంలో జియో సంచ‌ల‌నాల‌కు బ్రేకుల్లేవు. జియో కేవలం 83 రోజుల్లోనే దేశ‌వ్యాప్తంగా 5.2 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. ఈ జోష్‌లోనే ముఖేష్ ఈ ఉచిత ఫ్రీ వెల్ కం ఆఫ‌ర్‌ను వ‌చ్చే యేడాది మార్చి 31 వ‌ర‌కు కూడా పొడిగించారు. అయితే రీసింటే గా జియో చేసిన ఓ పొర‌పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం ఫైన్ వేయ‌నుంది. అసలు జియో చేసిన ఆ పొరపాటు ఏంటి? ఆ పైన్ ఎంతో తెలిస్తే షాక్ కావాల్సిందే.

జియోను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లేందుకు జియో భారీ ఎత్తున పేపర్ల‌లో ప్ర‌క‌ట‌న‌లు గుప్పించింది. ఈ క్ర‌మంలోనే వారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఫొటోను సైతం వాడుకున్నారు. అనుమ‌తి లేకుండా మోడీ ఫొటోను వాడుకున్నందుకు గాను జియోకు అక్ష‌రాలా రూ.500 ఫైన్ విధించ‌నున్నారు.

చిహ్నాలు, పేర్ల అక్రమ వినియోగ నిరోధానికి సంబంధించిన చట్టంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా ఇంతే విధించాలని ఉంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లిఖిత సమాధానంలో తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ జియో మోడీ ఫొటోను వాడుకున్న అంశాన్ని ప్ర‌స్తావించ‌గా అందుకు స్పందించిన రాజ్య‌వ‌ర్థ‌న్ జియో ఫైన్ విష‌యాన్ని చెప్పి అంద‌రూ అవాక్క‌య్యేలా చేశారు.

Related

  1. జియో – ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల లెక్క ఇదే!
  2. అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించిన జియో అధినేత ముకేష్ అంబానీ
  3. BSNL ఆఫర్ తో జియో కి దిమ్మతిరిగింది!
  4. జియో వినియోగ‌దారులకు మరో దిమ్మ‌తిరిగే ఆఫ‌ర్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -