‘అఖండ’ రిలీజ్​ .. ఓ కొలిక్కి వచ్చినట్టేనా?

- Advertisement -

బాలయ్యబాబు.. బోయపాటి కాంబినేషన్​లో సినిమా అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబినేషన్​లో తెరకెక్కిన సింహా, లెజెండ్​ బ్లాక్​ బస్టర్​ కావడంతో.. బోయపాటి కాంబినేషన్​ లో సినిమా రావాలని ఫ్యాన్స్​ ఎప్పటినుంచో కోరుతున్నారు. అయితే ఈ మూవీ భారీ బడ్జెట్​తో తెరకెక్కించాలని భావించినప్పటికీ బాలయ్య మార్కెట్​ దృష్ట్యా తగ్గించినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు చాలా రోజులు బాలయ్య బాబుతో నటించేందుకు టాప్​ హీరోయిన్లు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ప్రగ్యా జైస్వాల్​ను ఎంపిక చేశారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ ఎంతో అలరించింది.

ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు.. తొలిసారిగా అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. అఖండను మే 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ లాక్​డౌన్​తో షూటింగ్​ ఆగిపోయింది. దీంతో సినిమా మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో లాక్​డౌన్​ ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో షూటింగ్స్​ తిరిగి ప్రారంభమయ్యాయి. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోన్నట్టు సమాచారం.

- Advertisement -

అఖండలో శ్రీకాంత్​ విలన్ గా కనిపిస్తుండగా.. పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది. ఈ మూవీ కోసం బాలకృష్ణ ఫ్యాన్స్​ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మూవీ తర్వాత బాలయ్య .. అనిల్ రావిపూడి డైరెక్షన్​లో ఓ మూవీలో నటించబోతున్నాడు. ఈ సినిమాను దసరా రేసులో కేరళ తీయాలని ప్లాన్ చేసినా ఆ సమయంలో పుష్ప ఆచార్య తో పాటు మరి కొన్ని సినిమాల పోటీ పడుతుండడంతో ఒంటరిగా థియేటర్ లోకి వచ్చేందుకు ఈ సినిమాను వినాయక చవితి పండుగ సమయంలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Also Read

బాలయ్యకు నో చెప్పిన టబు.. అందుకేనా?

ఆ సినిమాకు ఒక్క రూపాయి తీసుకున్న బాలీవుడ్ హీరో..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -