Saturday, May 10, 2025
- Advertisement -

రానా మీదకు వచ్చిన కేసు.. అరెస్ట్ చేస్తారా??

- Advertisement -
prakash raj rana roped as junglee brand ambassadors

హీరోలు సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తుంటారు. ఎందుకంటే సినిమాల కంటే యాడ్స్ డబ్బు ఎక్కువ తెచ్చిపెడుతోంది కాబట్టి. ఒక సినిమా కోసం దాదాపు నాలుగు నెలలు పడిన కష్టం ఇక్కడ కేవలం రెండు రోజులు మొఖానికి మేకప్ వేసుకుంటే ఒచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగు – తమిళ పరిశ్రమ లో పెద్ద స్టార్ లు అయిన ప్రకాష్ రాజ్ , రానా దగ్గుబాటి లు రమ్మీ సర్కిల్ అనే ఆన్ లైన్ పేకాట వెబ్సైటు కోసం ప్రచారం చెయ్యడం విశేషంగా మారింది. వీరిద్దరు కలిసి చేసిన ఈ యాడ్ ఇప్పుడు సంచలనం రేపుతోంది.

ఇంట్లో పేకాట ఆడితే ఎలాంటి ఇబ్బందులు ఒస్తాయి అనేది ప్రాక్టికల్ గా చూపిస్తూ ఆన్ లైన్ రమ్మీ బెటర్ అని చూపించే లాగా సాగుతుంది ఈ యాడ్. మన దేశంలో పేకాట ఆడ్డం తప్పే కానీ.. అదే ఆన్ లైన్లో అయితే నిక్షేపంగా ఆడేసుకోవచ్చు. అందుకే నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉన్న యాక్టర్లతో యాడ్ ఇచ్చేసింది జంగ్లీ రమ్మీ. ఇద్దరూ కలిసి ఇంట్లో పేకాట ఆడుకోవడంలో ఇబ్బందులను ప్రాక్టికల్ గా చూపించి మరీ.. ఆన్ లైన్ లో రమ్మీ ఆడుకోమని సలహా ఇస్తున్నారు.

ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండమని చెప్పాల్సిన పొజిషన్ లో ఉన్నవాళ్లు.. యాడ్స్ చేస్తే వచ్చే డబ్బుల కోసం.. ఇంటింటికే కాదు.. ఫోన్ ఫోన్ కీ రమ్మీ ఆడుకోమని చెప్పడం చాలా దారుణమైన విషయం. కోయంబత్తూరుకు చెందిన ఓ సోషల్ యాక్టవిస్ట్.. రానా-ప్రకాష్ రాజ్ లపై అక్కడి కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పి ఇళగోవన్ అనే ఈ సామాజిక వేత్త.. ఈ సినిమా స్టార్లు ఇద్దరూ రమ్మీ ఆడమని ప్రోత్సహిస్తున్నారని కేసులో వివరించాడు. ప్రచారం చేసే సైట్ తో పాటు మరికొన్ని వెబ్ పోర్టల్స్ కూడా బెట్టింగ్ కు పురిగొల్పుతున్నాయి’ అంటూ కోయంబత్తూర్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు ఇళగోవన్. .. రమ్మీ.. గ్యాంబ్లింగ్ లపై నిషేధం ఉండడంతో.. తమకు అందిన ఫిర్యాదుపై విచారణ చేపడుతున్నారు కోయంబత్తూరు పోలీసులు. ఒకవేళ కేసు నమోదైతే మాత్రం రానాకి చిక్కులు తప్పక పోవచ్చు..

Related

  1. స‌మంత, రానా రొమాన్స్ వీడియో!
  2. రానా, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క్యాథ‌రిన్ హీరో హీరోయిన్లుగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం
  3. అల్లుఅరవింద్ రియల్ విలన్ – రానా!
  4. ప్రభాస్ కంటే నేనే ఎక్కువ అంటున్న రానా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -