Tuesday, May 7, 2024
- Advertisement -

అల్లుఅరవింద్ రియల్ విలన్ – రానా!

- Advertisement -

ఇటివలే సైమా అవార్డుల వేడుక చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారలతో ఈ వేడుక చాలా అద్భుతంగా జరిగింది. అయితే ఈ వేడుకలో బాహుబలిలో దగ్గుబాటి రానా చూపించిన విలనిజానికి గాను ఉత్తమ విలన్ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ చేతుల మీదిగా అందుకున్నాడు రానా.

అయితే అవార్డ్ తీసుకున్నాక రానా మాట్లాడుతూ రియల్ విలన్ అయిన అల్లు అరవింద్ గారి చేతుల మీదిగా ఉత్తమ విలన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి అందరినీ షాక్ కి గురి చేసాడు రానా. అల్లు అరవింద్ రియల్ విలన్ అని రానా చెప్పడంతో అక్కడే ఉన్న మెగా స్టార్ చిరంజీవి కూడా షాక్ అయ్యాడట. అయితే అల్లు అరవింద్ ను ఎందుకు విలన్ అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు రానా.

చిన్నప్పుడు స్కూల్ కి వెళుతున్న రోజుల్లో చరణ్ – రానా ఇద్దరు కూడా క్లాస్ మేట్స్ కావడంతో స్కూల్ కి ఎగ్గొట్టిన , ఎగ్జాం రాయకపోయినా అల్లు అరవింద్ కు వెంటనే తెలిసి పోయేదట దాంతో ఆ విషయాన్నీ అందరికి చెప్పి రానా , చరణ్ లు చేసిన అల్లరి పనుల గురించి చెప్పేవాడట. దాంతో చరణ్ కు అలాగే రానా కు అల్లు అరవింద్ అంటే భయమట. సో అందుకే మా పాలిట విలన్ అల్లు అరవింద్ అంటూ చెప్పుకొచ్చాడు రానా. అయితే అల్లు అర్జున్ ఫాదర్ ని అంత పెద్ద మాట అన్నప్పటికీ, తర్వాత రానా చిన్నప్పటి విషయం చెప్పడంతో అందరు నవ్వుకున్నారు. 

Related

  1. బన్నీకి మళ్లీ పవన్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు!
  2. ఎన్టీఆర్ ని బన్నీ ఏం అన్నాడో తెలుసా?
  3. బన్నీ దొంగ లెక్కలు చూపించాడా?
  4. బన్నీ కి చిన్న ప్రమాదం తప్పింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -