Thursday, May 16, 2024
- Advertisement -

రాజమౌళి నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్ తోనే.. సాక్ష్యం ఇదే!

- Advertisement -
Rajamouli Next Project With NTR

రాజమౌళి.. తెరకెక్కించిన బాహుబలి సినిమా లాస్ట్ వర్కింగ్ డే కూడా కంప్లీట్ అయ్యింది. బాహుబలి కోసం తాను చేయాల్సిన పని అయిపోయిదని చెప్పేశాడు. ఇక బాహుబలి 2 పబ్లిసిటీ పనులు మొదలు పెట్టారు. ఇక బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడు.. ఎవరితో చేస్తాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి.. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు లతో సినిమా చేస్తాడని రకరకల వార్తలు వస్తున్నాయి.

కానీ రీసెంట్ గా టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమచారం మేరకు.. ఓ పేరుకు జనాలు ఫిక్స్ అయిపోవచ్చు. ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా చేయనున్నాడనే అంచనాకి రావచ్చు. ఇందుకు పలు రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల్లో జరిగిన పరిణామాలే ఇందుకు కారణం. ఇటివలే రాజమౌళి భార్య రమా రాజమౌళి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భర్త తీసిన సినిమాల్లో  ‘యమదొంగ’ తనకు అసలు నచ్చని సినిమాని చెప్పింది. ఆ తర్వాత ‘సింహాద్రి’ అసలు ఎన్టీఆర్ కోసం రాసిన సబ్జెక్ట్ కాదంటూ.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తేల్చేశారు.

అసలు వీళ్లిద్దరూ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హిట్స్ ని టచ్ చేయాల్సిన అవసరం ఏంటన్నదే అసలు సిసలైన పాయింట్. సింహాద్రి మూవీ ఎన్టీఆర్ ని స్టార్ చేసింది. యమదొంగ సాధించిన సక్సెస్ తో.. ఎన్టీఆర్ మళ్లీ హిట్ పట్టాలెక్కాడు. అలాంటి రెండు చిత్రాలను రాజమౌళి టీం ఆడేసుకున్నారు. ఇదంతా ముందస్తు ప్లాన్ లో భాగంగానే జరుగుతున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఇప్పుడు అప్పటి ఎన్టీఆర్ సినిమాలను ఇప్పుడు రాజమౌళి టీం ప్రస్తావించాల్సిన అవసరమేమీ లేదు. అయినా సరే కావాలనే ఇలా చేస్తున్నారంటే.. ముందుగా రాజమౌళి- ఎన్టీఆర్ కాంబోపై హైప్ తగ్గించి.. చివరకు అసలు విషయం మెల్లగా చల్లగా చెబుతారన్న మాట. అఫ్ కోర్స్ ఇదంతా వ్యూహాత్మకమో.. ఊహాత్మకమో తెలియాలంటే కొన్ని వారాలు వేచి చూడాల్సిందే.

{youtube}uhyzxzwnu2w{/youtube}

Related

  1. ఎన్టీఆర్ కొత్త పార్టీ.. చంద్రబాబుపై కోపంతోనా..?
  2. ఎన్టీఆర్ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి??
  3. ఎన్టీఆర్‌తో రాజమౌళి నెక్ట్స్ మూవీ ఫిక్స్
  4. ఎన్టీఆర్ తో సమంతకు గొడవ.. ఎందుకు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -