Monday, May 27, 2024
- Advertisement -

దిన‌క‌ర‌న్ అరెస్ట్‌కు రంగం సిద్ధం

- Advertisement -
Dinakaran faces arrest

జ‌య‌ల‌లిత హ‌యాంలో  ఓవెలుగు వెలిగిన శ‌శిక‌లకు  (చిన్న‌మ్మ‌)  ఇప్పుడు  టై క‌ల‌సిరావ‌ట్లేదు. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత పార్టీనీ త‌న చెప్పుచేతుల్లో పెట్టుకోవాల‌ని ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా బెడిసికొడుతున్నాయి. సీఎం ప‌ద‌వికోసం ఆశించిన చిన్న‌మ్మ‌కు అక్ర‌మాస్తుల‌కేసులో బెంగులూరు కోర్టు నాలుగు సంవ‌త్స‌రాలు శిక్ష‌విధిండంతో త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మ‌లుపుతిరిగాయి.

త‌న‌కు విధేయుడైన ప‌ళ‌ని స్వామిని సీఎం పీఠంపై కూర్చొబెట్ట‌డంతొ  పార్టీ రెండుగా చీలిపోయింది. పార్టీనీ గాడిలో పెట్టాల్సిందిపోయి అమె తీసుకున్న నిర్ణ‌యాలు అమె రాజ‌కీయానికి శ‌రాఘాతంగా మారాయి. 

పార్టీ చీలిక నేపథ్యంలో.. పార్టీ గుర్తు అయిన రెండాకుల్ని తమ వర్గానికే కేటాయించాలంటూ చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ ఎన్నికల సంఘ అధికారి ఒకరికి రూ.60 కోట్ల లంచాన్ని ఇవ్వజూపారన్న ఆరోపణ అతడి మెడకు చుట్టుకుంది. సుఖేశ్ చంద్రశేఖర్ అనే దళారిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తమ విచారణలో ఈ విషయాన్ని బయట పెట్టారు.

సుఖేష్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌న్న దిన‌క‌ర‌న్‌పై  తాజాగా ఆయనపై లుక్ ఔట్ నోటీసుల్ని జారీ చేసినట్లుగా ఢిల్లీ జాయింట్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు.. ఓడరేవులకు దినకరన్ వివరాలు పంపినట్లుతెలిపారు. ఆయన కానీ విమానం ఎక్కేందుకు వస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతూ ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించినట్లుగా జాయింట్ కమిషనర్ చెబుతున్నారు. మరోవైపు.. తాజా పరిస్థితుల్లో దేశం విడిచి పారిపోయేందుకు ఆయన ప్రయత్నాలు చేసే అవకాశం ఉందన్న మాట కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకేలోని రెండు చీలిక వర్గాలు కలిసిపోయి.. చిన్నమ్మ.. అండ్ ఫ్యామిలీని దూరంగా పెట్టాలన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్న వేళలోనే అనూహ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పాలి. 

ఈ కేసు విచారణ జరుపుతున్న ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు. ఈసీకి లంచం ఇవ్వచూపిన కేసులో తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, దినకరన్‌ను అరెస్ట్ చేస్తామని, ఇప్పటికే విచారణ నిమిత్తం సమన్లు జారీ చేశామన్నారు.అలాగే దినరన్‌తో సుఖేష్ చంద్రసేఖర్‌కు ఉన్న సంబంధాలపై తాము ఆరా తీస్తున్నట్లు తెలిపారు. సుఖేష్‌ను అరెస్ట్ చేసిన రోజు కూడా అతను దినకరన్‌తో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించామని చెప్పారు. సుఖేష్‌కు గత నాలుగేళ్లుగా దినకరన్ తెలుసునని తమ విచారణలో తేలిందని చెప్పారు. వీరిద్దరు పలు సందర్భాలలో కలుసుకున్నారని తెలిపారు. ఎక్ష‌నానైన దిన‌క‌ర్‌ను అరెస్ట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

Also Read

  1. లిక్క‌ర్ కింగ్ విజ‌య్‌మాల్యా లండ‌న్‌లో అరెస్ట్‌…
  2. ఈ – వ్యాలెట్ సంస్థ‌ల‌కు ఆర్‌బీఐ బ్రేక్‌
  3. జైలులో శశికళ రోజుకు కూలీ ఎంతో తెలుసా..?
  4. జగన్ పై పెద్ద కుట్ర.. అసలు కారణాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -