Friday, March 29, 2024
- Advertisement -

రవితేజ ను అదుకుంటున్న జక్కన్న!

- Advertisement -
rajamouli preparing vikramarkudu 2 story for raviteja

మాస్ మహారాజ్ రవితేజ సినిమా మొదలు పెట్టాక చాలా రోజులు అయ్యింది. మధ్యలో దిల్ రాజ్ నిర్మాణంలో ఓ సినిమా మొదలు పెట్టిన అది ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. ప్రస్తుతం రవితేజ చేతిలో సినిమాలు లేవు. గతేడాది కిక్ 2, బెంగాల్ టైగ‌ర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఈ ఏడాది ఒక్క చిత్రంతో కూడా ప్రేక్షకులను పలకరించలేదు.

సినిమాలు ఏవీ లేకపోవడంతో రవితేజ కాస్త విశ్రాంతి కోసమంటూ ప్రపంచ టూర్ కి వెళ్లిపోయాడు రవితేజ. రవితేజకు స్టోరీలు నచ్చితే.. రెమ్యునరేషన్లు సెట్ అవ్వడం లేదు. మెయిన్‍గా రవితేజ రెమ్యునరేషన్ల విషయంలో ఎంత మాత్రం వెనక్కు తగ్గకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే రవితేజకు ఓ స్వీట్ న్యూస్ అందింది. ఆ స్వీట్ న్యూస్ ఇచ్చింది ఎవరో కాదు దర్శకధీరుడు రాజమౌళి. రవితేజ… విక్రమార్కుడు సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేసాడు. ఈ చిత్రం రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ చిత్రం వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. ఇప్పుడు ఈ చిత్రంకు సీక్వెల్ కథను రాస్తున్నాడట రాజముళి తండ్రి విజయేంద్రప్రసాద్. ఈ చిత్రంకో నటించే చాన్స్ రాజమౌళి రవితేజకు ఇచ్చాడట. ఈ చిత్రం డైరెక్టర్ విషయంలో క్లారిటీ లేకపోయినా రాజమౌళి ఈ కథను రవితేజ కు ఇవ్వడం నిజంగానే రవితేజ కేరీర్ కు ఊపిరిలూదినట్టే అనుకోవాలి. ఈ సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్ రాజమౌళి తన టీంలో ఓ ప్రతిభావంతుడికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ర‌వితేజ‌ను చూసి జాలిప‌డి రాజ‌మౌళి ఈ ఛాన్స్ ఇచ్చి ఉంటాడేమోన‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

Related

  1. ర‌వితేజ సినిమాలకు గుడ్ బై చెప్తున్నాడా?
  2. పీక‌ల్లోతు క‌ష్టాల్లో రాజ్ తరుణ్
  3. రాజమౌళి కి మంచులక్ష్మి కి మధ్య ఏం జరిగింది?
  4. రాజమౌళికి ఊహించని షాక్ ఇచ్చిన ర‌ష్మీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -