Monday, April 29, 2024
- Advertisement -

రేవంత్, జగ్గారెడ్డి మద్య తోడి కోడళ్ళ పంచాయతీ!

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతల మద్య ఉండే విభేదాల గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తరువాత ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగిపోయాయి. ఇతర పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని రేవంత్ రెడ్డి చేజిక్కించుకోవడంతో ఆ పార్టీ సీనియర్ నేతలంతా మూకుమ్మడిగా వ్యతిరేకత ప్రకటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అప్పట్లో పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి వారు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉండేవారు. ఇక ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి రేవంత్ రెడ్డే కారణం అనే ఆరోపణలు కూడా గట్టిగానే చేశారు..

ఇక మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న జగరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు కూడా ఇప్పటికీ రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే వీరి ఆధిపత్య పోరు కారణంగా రాష్ట్రంలో పార్టీ దారుణంగా బలహీన పడింది. అసలు ఆ పార్టీకి కంచుకోటగా ఉండే నియోజిక వర్గాలలో కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేనంతా దారుణంగా ఆ పార్టీ పరిస్థితి నెలకొంది. దాంతో పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలంటే కలిసికట్టుగా పని చేయడం ఒక్కటే మార్గమని భావించిన హస్తం నేతలు ఇప్పుడు దోస్త్ మేర దోస్త్ అంటున్నారు.

ఎప్పుడు ఉప్పు నిప్పు మాదిరి ఉండే రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ప్రస్తుతం ఎక్కడ కనిపించిన ఒకరినొకరు సరదాగా పలకరించుకుంటూ వారి మద్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.తాజాగా అసెంబ్లీ సిఎల్పీ కార్యలయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడగా తమ మద్య ఎలాంటి విభేదాలు లేవని, తమది తోడికోడళ్ళ పంచాయతి అని, పొద్దున తిట్టుకుంటాం.. సాయంత్రానికి కలిసిపోతాం అని మీడియాకు చెప్పుకొచ్చారు. ఇక రేవంత్ రెడ్డి పాదయాత్రకు తను మద్దతిస్తున్నట్లు చెప్పుకొచ్చిన జగ్గారెడ్డి.. అతని పదవీకాలం పూర్తి అయిన తరువాత తాను పీసీసీ చైర్మెన్ అవుతానంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి మునుగోడు ఎన్నికల ఫలితం తరువాత విభేదాలు పక్కన పెట్టి.. అందరూ కలగలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

ఇవి కూడా చదవండి

మోడీని తిట్టడమే వారి పని : ప్రధాని మోడీ కామెంట్స్ !

“లిక్కర్ క్వీన్” కవిత.. జైల్ కు వెళ్ళక తప్పదా ?

“బటన్ నొక్కుడు “.. ఇదేం పాలనరయ్యా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -