Monday, April 29, 2024
- Advertisement -

బాబు, పవన్ ఇద్దరు.. జగన్నే నమ్ముకున్నారా !

- Advertisement -

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రాభివృద్ది గురించి పక్కన పెడితే.. సంక్షేమ పథకాలపైనే పూర్తిగా దృష్టి పెట్టిన వైఎస్ జగన్ వాటిని పారదర్శికంగా అమలు చేస్తూ.. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మవొడి, వాహన మిత్రా, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా.. ఇలా చెప్పుకుంటూపోతే లిస్ట్ చాలా పెద్దదే అవుతుంది. ఇక గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వాలెంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి..ప్రభుత్వం అమలు చేసే పథకాలను నేరుగా ప్రజలకు అందేలా చూస్తున్నారు సి‌ఎం జగన్మోహన్ రెడ్డి. దాంతో జగన్ ప్రవేశ పెడుతున్న అన్నీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది.

ఇక జగన్ ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా లభ్ది పొందుతున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకే అండగా ఉంటారని భావిస్తున్న జగన్.. అందుకే ఈసారి విజయంపై కాకుండా 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇక మరోవైపు జగన్ పరిపాలనపై వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని టీడీపీ జనసేన పార్టీలు చెబుతున్నప్పటికి.. వైసీపీని ఓడించడం అంతా ఈజీ కాదనే విషయం చంద్రబాబు, పవన్ లకు బాగా తెలుసు. అందుకే పవన్ ఆ మద్య పవన్.. జగన్ను గద్దె దించేందుకు పొత్తులకు కూడా తాము సిద్దమే అనే సంకేతాలు ఇచ్చిన సంగతి విధితమే.

అయితే జగన్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికి ఆయన ప్రవేశ పెడుతున్న పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారు.. వచ్చే ఎన్నికల్లో వేరే ప్రభుత్వం వస్తే ఈ పథకాలన్ని.. రద్దు అవుతాయనే ఉద్దేశంతో.. అలా జరగకుండా ఉండేందుకు మళ్ళీ వైసీపీకే ఓట్లు వేసే అవకాశం ఉంది. దాంతో ఇప్పుడు పవన్ చంద్రబాబు సరికొత్త నినాదాన్ని అందుకున్నారు.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏ పథకాన్ని రద్దు చేయబోమని.. హామీ ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో గట్టిగానే పాతుకుపోయాయనే విషయం స్పష్టమౌతోంది. మరి జగన్ పథకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం అంతా ఈజీ కాదని.. అందుకే ఈ పథకాలను రద్దు చేయబోమని, ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలతో పాటు ఇంకా మెరుగైన కొత్త పథకాలు ప్రవేశ పెడతామని అటు పవన్.. ఇటు చంద్రబాబు ఒకే మాట వినిపిస్తున్నారు. మొత్తానికి వైఎస్ జగన్ను గద్దె దించడానికి ఆయన పథకాలనే నమ్ముకున్నారు చంద్రబాబు, పవన్.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు స్టైల్ మార్చడండోయ్ !

సీమలో.. జగన్ ” గర్జన ” !

ఇక నమ్మేదే లేదు.. జనసేన సెటైర్లు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -