Saturday, May 4, 2024
- Advertisement -

లోకేశ్ కోసం తెలుగు హీరోలు వెయిటింగ్!

- Advertisement -

ఈ మద్య కాలంలో లోకేశ్ కనకారాజ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికి ఊర మాస్ కంటెంట్ తో సినీ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు ఈ తమిళ్ డైరెక్టర్. ఖైదీ, మాస్టర్, లేటెస్ట్ గా విక్రమ్ ఇలా ఈ మూడు సినిమాలు కూడా తెలుగు తమిళ్ రెండు భాషల్లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. విక్రమ్ మూవీ ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. దీంతో లోకేశ్ దర్శకత్వంలో నటించేందుకు అన్నీ ఇండస్ట్రీ లలోని బడా హీరోలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోలు లోకేశ్ డైరెక్షన్ లో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మద్య రాంచరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు వంటి బడా హీరోలు లోకేశ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారని వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు కూడా లోకేశ్ తో మూవీ కోసం ఎదురు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. .

అయితే ప్రస్తుతం కేవలం తమిళ్ హీరోలతోనే లోకేశ్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం తలపతి విజయ్ తో ఓ మూవీ చేస్తున్న లోకేశ్.. ఆ తరువాత ఖైదీ సిక్వల్, విక్రమ్ సిక్వల్ మూవీస్ ను చేయనున్నాడు. మరి ఈ మాస్ డైరెక్టర్ తెలుగు హీరోలతో ఎప్పుడు చేస్తాడో అని తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విక్రమ్ సిక్వల్ లో రాంచరణ్ కూడా నటించే అవకాశం ఉందనే వార్తలు తమిళ్ సినీ సర్కిల్స్ లో ఆ మద్య బాగానే వినిపించాయి. కాగా లోకేశ్ కనకారాజ్ మొదటి సినిమా తెలుగు హీరో సందీప్ నటించిన ” నగరం ” ఈ మూవీ తమిళ్ మూవీగానే రూపొందినప్పటికి హీరో తెలుగు వాడే. దాంతో తెలుగు హీరోలతో కూడా లోకేశ్ సినిమాలు చేసే అవకాశం ఉంది. మరి ఈ మాస్ డైరెక్టర్ కోసం తెలుగు హీరోలు ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో.. తన మొదటి తెలుగు సినిమా ఏ హీరోతో ఉంటుందో మరి.

ఇవి కూడా చదవండి

హర్రర్ మూవీలో ప్రభాస్.. ఓన్లీ తెలుగులోనే!

భారీ బయోపిక్ ను రిజక్ట్ చేసిన మహేశ్..!

పుష్పా2 లో విలన్ గా స్టార్ హీరోయిన్?

మహేశ్ రాజమౌళి స్టోరీ అదేనట.. రాజమౌళి క్లారిటీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -