ఊహలు గుసగుసలాడే సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ రాశీ ఖన్నా. తొలి సినిమాతోనే తన అందం,నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.తర్వాత వరుస సినిమాలతో అలరించింది. అయితే కొంతకాలంగా వెండితెరకు దూరమైంది రాశీ. వెండితెరకు దూరమైన వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పనిలో పనిగా సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ షోని ప్రదర్శిస్తూ అలరిస్తోంది.
అందాలను రాశి పోసి పేర్చినట్లుండే రాశి ఖన్నా ..తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయింది. గతంలో బికినీ ఫోటోలను సైతం షేర్ చూసిన ఈ బ్యూటీ ఇంతలా అందాలను చూపించలేదు. రాశీ ఫోటోలను చూసిన వారు నోరెళ్లబెట్టకమానరు. అంతలా కళ్లకు కనువిందు చేసి కుర్రకారు మనసును దోచేసింది. చూస్తూనే ఉండాలనిపించేలా ఉన్న రాశీ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారగా వెండితెరపై ఎప్పుడు అలరిస్తావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక రాశీ ఖన్న సింగర్ అన్న సంగతి కూడా తెలిసిందే. తెలుగులో కొన్ని పాటలు కూడా పాడారు. ఉండిపోరాదే అంటూ హుషారు సినిమాలో రాశీ పాడిన పాట ట్రెండింగ్‌గా కూడా మారింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది రాశీ.