అన్ని భాషల్లోనూ ఫుల్​ బిజీ..!ఆ హీరోయిన్ ఎవరంటే ..!

- Advertisement -

ఊహలు గుసగుస లాడే చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్​గా పరిచయమైంది రాశీ ఖన్నా. ఆ తర్వాత వరసగా స్టార్​ హీరోల సరసన చాన్స్​ దక్కించుకుంది. అయితే నటనకు అవకాశం ఉండే పాత్ర ఇప్పటివరకు రాశీకి దొరకలేదు. మొదటి చిత్రమే కొంత బెటర్​. ఆ తర్వాత ఎక్కువ సినిమాల్లో సెకండ్​ హీరోయిన్​గానే స్థిరపడిపోయింది. కానీ అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం రాశి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఒక్క తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా.. హిందీ, తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నది.

ఇక సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్​గా ఉంటుంది రాశీ ఖన్నా. మరోవైపు గ్లామర్​ రోల్స్​ చేసేందుకు కూడా వెనకాడదు. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో రాశీఖన్నా దూసుకుపోతున్నది. ‘అరణ్‌మణై 3’, విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’ సినిమాలను పూర్తిచేసింది. కార్తీ నటిస్తున్న ‘సర్దార్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ధనుష్‌ హీరోగా మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి హీరోయిన్‌గా రాశీఖన్నాని ఎంపిక చేశారట.

- Advertisement -

ఈ సినిమాల్లో కొన్ని సక్సెస్​ అయితే రాశికి ఇక అవకాశాలు క్యూ కడతాయి. అయితే గ్లామర్​ డాల్​గానే మిగిలిపోకుండా.. కాస్త నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటే ఇంకా బెటర్​. ఇకపోతే తెలుగులోనూ రాశీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాలు చేస్తున్నది. హిందీలో షాహిద్‌ కపూర్‌ ‘సన్నీ’ (వర్కింగ్‌ టైటిల్‌), అజయ్‌ దేవగణ్‌ ‘రుద్ర’ వెబ్‌ సిరీస్‌ల షూటింగ్‌లతో రాశీఖన్నా బిజీగా ఉంది. తెలుగులో కలిసి రాకపోయినా.. మిగతాభాషల్లో హిట్లు దొరికినా.. అక్కడే సెటిల్​ అయిపోదామని చూస్తోందట రాశీ ఖన్నా .

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -