Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కొడుకు ఎంట్రీపైన రేణు దేశాయ్ హాట్ కామెంట్స్!

- Advertisement -

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వెండితెరపై తమ సత్తా చాటుకున్నారు. ఇక త్వరలోనే మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసునిగా ఆయన పెద్ద కొడుకు అకీరా నందన్ టాలీవుడ్ల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చాలా కాలంగా సోషల్ మీడియాలోనూ ఇండస్ట్రీలోనూ ఊహాగానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

తాజాగా అకీరా నందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ పై తల్లి రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ తన కెరీర్ కు సంబంధించిన విషయాలతో పాటు కొడుకు అకీరా నందన్,కూతురు ఆధ్య కు సంబంధించినఫోటోలు, వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంటుంది.

Also read:ఆర్ఆర్ఆర్ చూస్తే ఆడియన్స్ కన్నీళ్లు పెట్టింటారు..?

తాజాగా రేణు దేశాయ్ అభిమానులతో లైవ్ కార్యక్రమంలో మాట్లాడుతుండగా కొందరు నెటిజన్స్ అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి అడగడంతో రేణు దేశాయ్ దానికి సమాధానం ఇస్తూ అకీరా సినిమా ఎంట్రీ గురించి చెప్పే సమయం కాదని, కోవిడ్ గురించి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనని, కాకపోతే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని ఆమె చెప్పుకొచ్చింది.ప్రస్తుతం అకీరా నందన్, ఆధ్య కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. అలాగే మీరు కూడా మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని అభిమానులకు సూచించింది.

Also read:మహేష్ బాబుతో నిధి అగర్వాల్ రొమాన్స్.. ఏ సినిమా కోసమంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -