Friday, March 29, 2024
- Advertisement -

నా పెళ్లి గురించి మీకెందుకు.. : రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్.. ఇద్దరు పిల్లల తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత రేను దేశాయ్ మీడియాకి టచ్ లో ఉండడంతో.. ఆమె రెండో పెళ్లిపై అందరిలో ఆసక్తి పెరిగింది. పవన్ అభిమానుల్లో కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నా.. చాలా మంది సపోర్టుగా నిలిచేవాళ్లు ఉన్నారు. అయితే తనకు ఆ ప్రశ్న ఎదురైన ప్రతిసారీ దాటవేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది.

మొన్నటికి మొన్న ఇన్ స్టా ప్రశ్నావళి సెషన్స్ లో ఏదోలా ఆ ప్రశ్నకు జవాబివ్వకుండా దాటవేశారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో ఇదే తిరకాసు ప్రశ్న ఎదురైంది. అయినా నా పెళ్లిపై మీకెందుకంత ఆసక్తి వదిలేయండి! అన్నట్టే రేణు ఎక్స్ ప్రెషన్ పెట్టారు. పెళ్లి చేసుకున్న కష్టమే.. చేసుకోకపోయినా కష్టమే.. అంటూ కాస్త విసుగ్గా చెప్పారు. ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఆన్సర్ చెబుతాను అని ఆ ఇంటర్వ్యూలో మెలిక పెట్టారు. అయినా మీరు నా పెళ్లికి వచ్చేది లేదు.. చేసేది లేదు ఎందుకింత ఆసక్తి? అంటూ తిరిగి యాంకర్నే ప్రశ్నించింది రేణు దేశాయ్.

ఈ పెళ్లి గురించి ప్రశ్నలతో తాను విసిగిపోయానని.. తాను ఓ సినిమా చేస్తే దానికి పెళ్లి గోల అని టైటిల్ పెడుతానని సరదాగా అనేశారు. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నానని రేణు అన్నారు. మొత్తానికి ఆ ప్రశ్నకు మాత్రం సరైన ఆన్సర్ ఇవ్వకుండా మరోసారి దాటవేశారు తెలివిగా. అలాగే మహేష్- ప్రభాస్ లాంటి హీరోల సినిమాల్లో నటించే అవకాశం వస్తే నటిస్తానని అయితే వారి చిన్నప్పటి మదర్ గా మాత్రమే కనిపిస్తానని చెప్పింది.

బిగ్ బాస్ 4లో వర్మ ’నగ్నం బ్యూటీ’.. ?

నాకు కరోనా వస్తే పవన్ కనీసం ఫోన్ చేయలేదు : బండ్ల గణేష్

నిహారిక పెళ్లి పబ్లిక్ పండగ కాదు : నాగ బాబు కామెంట్లు

బిగ్‌బాస్‌ 4కి హోస్ట్ గా విజయ్ దేవరకొండ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -