నాకు కరోనా వస్తే పవన్ కనీసం ఫోన్ చేయలేదు : బండ్ల గణేష్

- Advertisement -

టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి అందరికి తెలిసిందే. బండ్ల గణేష్ ని నిద్రలో లేపి అడిగిన పవన్ కళ్యాణ్ నా దేవుడు అని చెబుతాడు. పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, గబ్బర్ సింగ్ రెండు సినిమాలు చేశాడు. ఇందులో గబ్బర్ సింగ్ పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే కొంత కాలంగా సినిమాలను నిర్మించడం లేదు బండ్ల గణేష్.

త్వరలోనే సినిమాలు మళ్లీ నిర్మిస్తానని చెబుతూ వచ్చాడు. అయితే ఇటీవలే బండ్ల గణేష్ కి కరోనా వచ్చిన విషయం తెలిసిందే. ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకొన్న బండ్ల గణేష్ త్వరగానే కోలుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు. తన ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలెట్టిన బండ్ల.. కొన్ని భీభత్సమైన స్టేట్ మెంట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో అనవసరంగా నటించానని మహేశ్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టిన బండ్ల ఇప్పుడు మరో సెన్సేషనల్ కామెంట్ చేశాడు.

- Advertisement -

తనకు కరోనా వచ్చిందని జాలిపడి ఇండస్ట్రీలో అందరూ ఫోన్లు చేసి పరామర్శించారట. ఆఖరికి తాను భయపడే మోహన్ బాబు కూడా ఫోన్ చేసి మరీ ఎలా ఉన్నావ్ అని అడిగారు కానీ.. తాను దేవుడిగా పూజించే పవన్ కళ్యాణ్ మాత్రం ఫోన్ చేయలేదని.. కనీసం తన క్షేమ సమాచారాల గురించి వాకబు కూడా చేయలేదని బండ్ల బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ గా ఫీల్ అయ్యే అలీనే సరిగా పట్టించుకోలేదు. అలాంటిది బండ్లను పట్టించుకోకపోవడ పెద్ద విషయం కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

నిహారిక పెళ్లి పబ్లిక్ పండగ కాదు : నాగ బాబు కామెంట్లు

బిగ్‌బాస్‌ 4కి హోస్ట్ గా విజయ్ దేవరకొండ..?

సీక్రెట్ గా హీరోయిన్ తేజస్వికి పెళ్లి అయిందా ?

అంజలి కెరీర్ ను నాశనం చేసిన సినిమా ఇదే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -