Thursday, April 25, 2024
- Advertisement -

మహేశ్ బాబు సినిమాలో పవన్ కల్యాణ్ మాజీ భార్య!

- Advertisement -

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేశ్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించే ఓ వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో మహేశ్ వదిన పాత్రలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ నటించబోతుందని సమాచారం. అంతేకాదు ఇప్పటికే ఈ పాత్ర చేస్తున్నందుకు రేణూ దేశాయ్ కూడా బాగా ఎగ్జైట్ గా ఉందని తెలుస్తోంది. మరి రేణూ పాత్రని పవన్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రీ’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసిన నటించిన రేణూ.. పవన్‌తో తొలి పరిచయంతోనే ప్రేమలో పడింది. అయితే చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురంలో మనస్పర్థలు వచ్చి విడిగా ఉంటున్నారు. ఇక పవన్‌తో విడిపోయిన తర్వాత పిల్లలతో కలిసి పూణెలో నివాసం ఉంటోంది. ప్రస్తుతం రేణూ సరారు వారి పాట సినిమాతో పాటు మరో మూవీలో కూడా నటిస్తున్నారు. ఒక పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు రేణు దేశాయ్. డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ఆధ్య తో యువ ప్రతిభాశాలి ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

రహస్యంగా పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!

వెంకటేష్ వైఫ్ గురించి ఆసక్తికర విషయాలు..!

అందరి ముందు క్షమాపణలు కోరిన రవి.. ఒక్కటైన లాస్య, రవి

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -