Friday, May 10, 2024
- Advertisement -

స్టార్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్?

- Advertisement -

టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్ “చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా మరొక వైపు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

శంకర్ – చరణ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఎంతో గుర్తింపు పొందిన సెలబ్రిటీలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ మరొ కస్టార్ దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. “ఖైదీ”, “మాస్టర్” చిత్రం ద్వారా తెలుగు తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Also read:రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?

లోకేష్ కనగ రాజ్ చెప్పిన స్టోరీ లైన్ చెర్రీకి నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోందనే సమాచారం వినిపిస్తున్నప్పటికీ ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అదేవిధంగా ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

Also read:భర్తతో విడిపోయిన విడాకులివ్వలేదు.. ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -