Friday, April 26, 2024
- Advertisement -

జగ్గుభాయ్​.. బాలీవుడ్​ పయనం..!

- Advertisement -

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో క్రేజ్​ తెచ్చుకున్న జగపతి బాబు.. ఆ తర్వాత ఆర్థికంగా నష్టపోయాడు. వరుస ప్లాప్​లతో సతమతమయ్యాడు. అప్పులపాలయ్యాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ జగపతి బాబు సెకండ్​ ఇన్సింగ్స్​లో అనూహ్యంగా సక్సెస్​ అయ్యాడు. జగపతి బాబు కేవలం ఫ్యామిలీ హీరో మాత్రమే కాదు.. అతడిలో గొప్ప నటుడు ఉన్నాడు. అంతఃపురం లాంటి చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడు.

అయితే హీరోగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న జగపతి బాబుకు బాలయ్య లెజెండ్​లో విలన్​ గా అవకాశం రావడం ఆయన కెరీర్​ను మలుపు తిప్పింది. ఆ తర్వాత మన్యం పులి సినిమాలో మోహన్ లాల్ ని ఢీ కొన్నాడు. దీంతో జగపతిబాబు నటనకు దక్షిణాది మొత్తం ఫిదా అయ్యింది. దీంతో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇక అరవింద సమేత వీర రాఘవలో జగపతి చేసిన పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

Also Read: స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..

ప్రస్తుతం జగపతి బాబు బాలీవుడ్​లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ త్వరలో ఓ పాన్​ఇండియా మూవీలో నటించబోతున్నాడు. టాలీవుడ్​కు చెందిన ఓ అగ్రనటుడు ఈ మూవీని నిర్మిస్తున్నట్టు టాక్​. ఈ సినిమాలో విలన్​ పాత్రకు జగపతి బాబు ఎంపికయ్యాడట. మరో కీలక పాత్రకు కోలివుడ్​కు చెందిన ఓ విలక్షణ నటుడు ఎంపికయినట్టు టాక్​. మొత్తానికి జగపతి బాబు.. బాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న మాట. అక్కడ కూడా సక్సెస్​ అయితే కొంత కాలం పాటు జగపతి బాబుకు తిరుగే ఉండదు.

Also Read: ఈ సారి పవన్ నుంచి ఫన్ ఒక్కటే కాదు.. మెసేజ్ కూడా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -