Monday, May 20, 2024
- Advertisement -

లీకైన సాహో టీజర్.. ఎలా ఉందో తెలుసా..?

- Advertisement -
Saaho Teaser Leaked

బాహుబలి 2 తర్వాత ప్రభాస్.. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సాహో అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు రెండు రోజుల క్రితం లోగో పోస్టర్ ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా టీజర్ ని ఏప్రిల్ 28 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

రిలీజ్ కంటే ముందు ఈ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ టీజర్ లో ప్రభాస్ కళ్ళలోతుల్లోంచి వస్తున్నట్లు చేసిన గ్రాఫిక్స్ కొత్తగా ఉంది. అంతేకాకుండా మొహంపై రక్తం కారుతున్నట్లున్న ప్రభాస్ ని చూస్తే పక్కా యాక్షన్ సీన్ గా తెలుస్తోంది. ” తన రక్తం చూస్తేనే అర్ధమవుతుందిరా.. వాడిని చచ్చేంతలా కొట్టారని” అని విలన్ మిర్చి ఫేమ్ సంపత్ అడగగా .. అతని అనుచరుడు “సార్. అది అతని రక్తం కాదు.. మనవాళ్లది” అని చెప్పగానే ప్రభాస్ మొహంపై పడిన రక్తాన్ని తుడుచుకుంటూ “ఇట్స్ షో టైమ్” అంటూ డైలాగ్ పేలుస్తాడు. 30 సెకన్ల ఈ వీడియో చూస్తుంటే ప్రభాస్ ఇమేజ్ ని సాహో తో సుజీత్ మరింత పెంచేలా ఉన్నాడు.

Related

  1. రిలీజ్ కు ముందే బాహుబలి-2 స్టోరీ లీక్.. నెట్ లో హల్ చల్
  2. సుచి మరో లీక్.. హీరోయిన్ న్యూడ్ వీడియో హల్ చల్!
  3. షాప్ ఓనర్‌తో హీరోయిన్ రొమాన్స్.. నెట్ లో వీడియో హల్ చల్!
  4. నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్రియా ఆంటీ వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -