Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్ బాస్ లోకి చిన్నారి పెళ్ళికూతురు… షో ఎప్పుడు ప్రారంభమంటే?

- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు తీవ్రంగా వ్యాపించడంతో దేశవ్యాప్తంగా పలు సినిమా సీరియల్ షూటింగ్ లు ఆగిపోయినప్పటికీ బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో మాత్రం వాయిదా పడకుండా షూటింగ్ లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హిందీ బిగ్ బాస్ షో లో ప్రసారం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

గత కొద్ది నెలల క్రితమే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తూ బిగ్ బాస్ సీజన్ 14 ముగిసింది. ఈ క్రమంలోనే నిర్వాహకులు బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభించడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కొనసాగింది. ఈ క్రమంలోనే చిన్నారి పెళ్ళికూతురు (హిందీలో బాలికా వధు) ఫేమ్ నేహా మర్దా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Also read:10 మంది బాలీవుడ్ సెలబ్రెటీలతో ప్రభాస్ సినిమా?

గత నాలుగేళ్లుగా నాతో నిర్వాహకులు సంప్రదిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వారి ఆఫర్ ను నేను అంగీకరించలేదని తెలిపారు. తాజాగా ప్రారంభం కాబోయే సీజన్ కోసం కూడా బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించినట్లు తెలిపారు. ఒక గదిలో లాక్ చేసి జీవితం గడపడం తనకి ఇష్టం ఉండదని అందుకోసమే ఈ షో లో పాల్గొనడానికి తను అంగీకరించలేదని తెలిపారు. అయితే ప్రస్తుతం టీవీ షూటింగులు కూడా బిగ్‌బాస్ ఫార్మాట్‌లో కొనసాగుతున్నాయి అంటూ నేహా మర్దా తెలిపారు.

Also read:ఆ సెంటిమెంట్ తో భయపడుతున్న.. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -