Wednesday, April 24, 2024
- Advertisement -

రజినీకాంత్ కి భయపడుతున్న వెంకటేష్

- Advertisement -

పవన్ కళ్యాణ్ తో గోపాలా గోపాలా గానీ, దృశ్యం సినిమా రీమేక్ గానీ ఏ సినిమా అయినా వెంకటేష్ పూర్తిగా రీమేక్ చేసి గానీ మల్టీ స్టారర్ లో గానీ కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలం లో పూర్తి సోలో హీరోగా సొంత కథతో చేస్తున్న సినిమా బాబు బంగారం ఒకటే అని చెప్పుకోవాలి. నయనతార హీరోయిన్ గా ఉన్న ఈ సినిమాకి మారుతి డైరెక్టర్.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న వెంకటేష్ ఇప్పటికే టీజర్ లో అతని స్టైల్ ఏంటి అనేది చూపించాడు. కొత్త తరహాలో కామెడీ ప్రధానంగా రాబోతున్న ఈ సినిమా మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ కెరీర్ లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా సాగింది ఈ సినిమా వ్యాపారం. ఈ నేపధ్యం లో విడుదల కి సర్వం సిద్దం చేసుకోగా విడుదల తేదీ ని ఇవ్వడానికి జంకుతున్నారు నిర్మాతలు.

రజినీకాంత్ నటించిన కబాలి మూవీకి విడుదల డేట్ ని అనౌన్స్ చేస్తే.. దానికి అనుగుణంగా కొంత గ్యాప్ ఇచ్చి థియేటర్లలోకి రావాలన్నది వెంకీ-మారుతిల ఆలోచన. అందుకే జూలై 15న కబాలి వస్తుందనే ఉద్దేశ్యంతో జూలై 29న విడుదల చేయాలని భావించారు. కబాలి సంగతి తేలితే కానీ ఈ సినిమా సంగతి తేలేలా లేదు.

Related

  1. రజినీకాంత్ సినిమాని విడుదల అవ్వకుండా ఆపుతోంది ఎవరు ?
  2. కోటి రూపాయలు ఇచ్చిన రజినీకాంత్ :
  3. మ‌హేష్ తండ్రి పాత్ర‌కు రజినీకాంత్!
  4. రజినీకాంత్ ఆరోగ్యం సీరియస్ – కారణం ఇతనే ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -