Saturday, May 18, 2024
- Advertisement -

పరిటాల, సూరి వర్గాల మధ్య రాళ్లదాడి..

- Advertisement -
Fighting Between Paritala And Suri Batchserious Conditions Ananta Puram

అనంతపురం టీడీపీ లో గ్రూపు సమస్యలు భగ్గుమంటున్నాయి. మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య విద్యుత్ కేబుల్ పనుల విషయంలో గొడవ జరిగగా.. ధర్మవరంలో ఉద్రికత్త వాతావారణం ఏర్పడింది. ఈ సంగతిపై ఎమ్మెల్యే సూరి.. పరిటాల వర్గీయులపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదుచేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ.. డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

మంత్రి సునీత వర్గీయులు చేపట్టిన విద్యుత్‌ కేబుల్‌ పనులను ఎమ్మెల్యే సూరి వర్గానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య గొడవ ఏర్పడింది. పరిటాల, సూరి వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో పరిటాల వర్గీయులకు చెందిన ముగ్గురు గాయపడ్డారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకొని ఇరువర్గాలకు చెదరగొట్టారు. ఈ నెపథ్యంలో ఆందోళనకారులు పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు.

దాంతో ఈ విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికే జేసీ బ్రదర్స్ పార్టీ పరువు తీస్తున్నారు.మీరు కూడా ఇలా కొట్లాటలకు దిగితే  ఇక అనంతపురంలో టీడీపీ పని ఖతం అయినట్లే అని పరిటాల వర్గీయులపై  విరుచుకుపడినట్లు సమాచారం. అయితే టీడీపీ పార్టీలో ఇలాంటి గొడవలు మాములే అని అయితే ఆ ఘర్షణలను ఒక ఫ్యామిలీలా సర్దుబాటు చేసుకుంటామని ఎమ్మెల్యే వరదాపురం సూరి చెప్పుకొచ్చాడు. సో మొత్తానికి అనంతపురంలో ఇరువర్గాల గొడవల నేపథ‌్యంలో విబేధాలు మరింత పెరిగి..  2019 లో పార్టీకి తీవ్ర నష్టంజరిగే చాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -