Saturday, May 11, 2024
- Advertisement -

పవన్.. ఎన్టీఆర్ మధ్య పోరు.. గెలుపు ఎవరిది..?

- Advertisement -
Pawan Kalyan Vs NTR at Tollywood Box Office

ఈ ఏడాది రసవత్తర బాక్సాఫీస్ సమరాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. ఆల్రెడీ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణల మధ్య పోరు బాక్సాఫీస్ ను వేడెక్కించింది. ఇక సమ్మర్లో కాటమరాయుడు.. బాహుబలి: ది కంక్లూజన్.. దువ్వాడ జగన్నాథం.. మహేష్-మురుగదాస్ సినిమాల మధ్య ఆసక్తికర సమరం జరగబోతోంది. ఇక దసరా.. దీపావళి పండగలకు కూడా ఆసక్తికర పోరు చూడబోతున్నాం.

ఐతే అంతకంటే ముందు ఆగస్టులో మరో బాక్సాఫీస్ బొనాంజా రాబోతోంది. పవన్ కళ్యాణ్.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చాలా తక్కువ వ్యవధిలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడే అవకాశాలున్నట్లు సమాచారం. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న కొత్త సినిమా ఆల్రెడీ సెట్స్ మీదికి వెళ్లిపోయింది. ఎన్టీఆర్ ఈ నెల 15 నుంచి షూటింగుకి హాజరు కానున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ మార్చుకుని షూటింగుకి రెడీ అయిపోయాడు. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోయే కొత్త సినిమా ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.

ఆల్రెడీ కాటమరాయుడు సినిమాను పూర్తి చేసిన పవన్.. కొంచెం గ్యాప్ తీసుకుని ఈ చిత్రంపై దృష్టిపెట్టనున్నాడు. ఈ రెండు రెండు సినిమాల్ని దాదాపు నాలుగు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వీటి రిలీజ్ కూడా ఆగస్టులోనే ఉండబోతోంది. రెండు సినిమాలు రెండు వారాల వ్యవధిలో వస్తాయని సమాచారం.ఒక సినిమా ఆగస్టు 11న ఇంకోటి 25న వస్తాయని ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఏది ముందు పూర్తయితే అది ముందుగా థియేటర్లలోకి వస్తుంది. కాబట్టి ఆగస్టులో బాక్సాఫీస్ వేడెక్కడం ఖాయం.

Related

  1. పవన్ అభిమానుల పై హరీష్ శంకర్ సంచలన ట్విట్
  2. పవన్ ఫ్యాన్స్ దెబ్బకి అల్లు అర్జున్ కి చుక్కలు!
  3. డైరెక్టర్ కి సూపర్ గిప్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. రేటు ఎంతో తెలుసా?
  4. ఎన్టీఆర్ జై ల‌వ కుశ‌ లో చేసే మూడు రోల్స్ ఇవే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -