సురేఖవాణి… గ్లామరస్ అంటీగా పేరు తెచ్చుకున్న నటి. బుల్లితెరలో ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ షోతో పాపులరై వెండితెరపై కూడా క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. ఇప్పుడు టాలీవుడ్ లో అక్క, వదిన పాత్రలలో అలరిస్తుంటుంది సురేఖ.
అయితే ఈ మధ్య ఆమె పర్శనల్ వీడియో ఒకటి నెట్ లో హాల్ చల్ చేసింది. తన కూతురుతో కలసి సురేఖ వాణి షూట్ చేసుకున్న ఒక వీడియో నెట్ లో ప్రత్యేక్షమైయింది. పొట్టి జీన్స్ షార్టు వేసుకున్న సురేఖ.. ఈ వీడియోలో రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. మరి ఇది ఎలా బయటికి వచ్చిందో గానీ ‘సురేఖవాణి హాట్ వీడియో’ అనే పేరుతో నెట్ లో వైరల్ అయ్యింది. దీనిపై అప్పట్లో చాలా అనుమానాలు వచ్చాయి. పర్శనల్ గా తీసుకున్న ఈ వీడియో లీక్ అయ్యిందా ? లేదా కావాలనే పబ్లిసిటీ కోసం లీక్ చేశారా? అనే సందేహాలు వ్యక్త మయ్యాయి.
అయితే ఇప్పుడు వినిపిస్తున్న విషయం ఏమిటంటే.. ఈ వీడియో లీక్ అవ్వడం పై సురేఖవాణి బాగా డిస్ట్రబ్ అయ్యిందట. చాలా మంది ఈ విషయంలో ఆమెకు నెగిటివ్ కామెంట్స్ వినిపించారట. ఇంకో విషయం ఏమిటంటే.. ఈ వీడియోను ఎదో టైటిల్ పెట్టి కొన్ని అభ్యంతరకరమైన సైట్స్ లో అప్లోడ్ చేశారట. దీంతో బాగా హార్ట్ అయిన సురేఖ.. ఇప్పుడు ఆ వీడియో కంటెంట్ ఎక్కడ దొరక్కుండా బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకుంటుందని సమాచారం. అయితే ఆ వీడియో ఎప్పుడో వైరల్ అయిపోయింది. మరి ఇప్పుడు తొలగించి ఏం లాభం అనేది అసలు ప్రశ్న. బాహుస ఆ వీడియో ఆన్ లైన్ లో వుండడం ఆమెకు నచ్చడం లేదేమో.
{youtube}TbOYxtXGkmk{/youtube}
Related