Sunday, May 19, 2024
- Advertisement -

వామ్మో.. ఇలియానాకు అంత వయసు ఉంటుందా?

- Advertisement -
ileana age in shocking

దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాలా భామ ఇలియానా. ఇప్పటికి ఈ భామ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి 12 సంవ‌త్స‌రాలు అవుతోంది. ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఇలియానా.. టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించింది. ఇలియానాను చూస్తే ఇంకా లేత పరువంలో ఉన్న కుంద‌న‌పు బొమ్మ‌లా క‌నిపిస్తుంది. అయితే ఇలియానాకు తాజా పుట్టిన రోజుతో 30 సంవ‌త్స‌రాలు నిండాయి.

వికీపీడియా పేజ్‌లోను ఇరవై తొమ్మిదేళ్లే అని ఉన్నా కానీ ఇలియానా తన వయసుని స్వయంగా రివీల్‌ చేసింది. త‌న తాజా పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇలియానా 30 ఏళ్లు నిండుతున్నాయంటూ తన అభిమానులకి చెప్పింది. పోకిరి సినిమాలో త‌న పిట్ట న‌డుము అందాల‌తో కుర్ర‌కారుకు కిక్ ఇచ్చిన ఇలియానా ఇక్క‌డ మంచి ఛాన్సులు వ‌స్తుండ‌గానే బాలీవుడ్‌లో ఓ వెలుగు వెల‌గాల‌న్న కోరిక‌తో అక్క‌డ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో అనుకున్న‌ట్టుగా కాలం క‌లిసి రాక‌పోవ‌డంతో అటు బాలీవుడ్ లో… ఇటూ టాలీవుడ్ లో సరైన ఆఫర్స్ రాలేకపోతున్నాయి.

ఇక ఇల్లూ బేబీ ఇండ‌స్ట్రీలోకి వచ్చిన రోజు నుంచీ అదే ఫిజిక్‌ మెయింటైన్‌ చేస్తూ ఇప్పటికీ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో సెక్సీయస్ట్‌ ఫిగర్‌ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా వెలుగుతోంది. బాయ్‌ఫ్రెండ్‌తో లివ్‌ ఇన్‌ రిలేషన్‌ మెయింటైన్‌ చేస్తూ ఆ విషయాన్ని ఏమాత్రం గుట్టుగా పెట్టని ఇలియానా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటోంది. మరో మూడు, నాలుగేళ్ల పాటు నటన కొనసాగించి ఆ తర్వాత తాపీగా తన ఫోటోగ్రాఫర్‌ బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడుతుందట.

Related

  1. రాజమౌళి కి మంచులక్ష్మి కి మధ్య ఏం జరిగింది?
  2. గొప్ప మనసు ఉన్న వ్యక్తి రామ్ చరణ్
  3. సుడిగాలి సుధీర్ కు ఝులక్ ఇచ్చిన రోజా!
  4. మేము సైతంలో రికార్డు సృష్టించిన మెగా హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -