Thursday, April 25, 2024
- Advertisement -

నీ భార్యకు చెప్పు.. నువ్వు యూజ్ లెస్ అని.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫైర్!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్.ఎస్.తమన్ ఒకరు. ప్రస్తుతం ఎన్నో సినిమాలకు సంగీతం అందిస్తు ఎంతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే తమన్ కు నెటిజన్ల నుంచి ఎక్కువ నెగిటివిటీ ఎదురవుతుంది. తమన్ ఎప్పుడు మాట్లాడతాడా, అతనిని ట్రోల్ చేద్దామని ఎంతోమంది నెటిజన్లు ఎదురుచూస్తూ ఉంటారు.

ఇదివరకే తమన్ గురించి ఎన్నోసార్లు నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేశారు. ఇదివరకే కింగ్ సినిమాలో బ్రహ్మానందం జయసూర్య అనే మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో కనిపిస్తారు. అందులో బ్రహ్మానందం ప్రతి ఒక ట్యూన్ ని కాపీ కొడుతూ ఇది నాదే అంటూ గొప్పలకు పోతాడు. ఈ విధంగానే తమన్ కూడా ట్యూన్లను కాపీ కొట్టారంటూ నెటిజన్లు పెద్దఎత్తున ట్రోల్ చేస్తుంటారు.

Also read:ఆ లేడీ డైరెక్టర్ తో ప్రభాస్ నెక్స్ట్ చిత్రం.. కథ అదే!

ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్ బ్రహ్మానందం జయసూర్య పాత్రను ఎస్ఎస్ తమన్ తో పోలుస్తూ నా పిల్లలకు ఎస్.ఎస్.తమన్ అంటే ఇతనేనని చూపిస్తా అంటూ కామెంట్ చేశారు.. ఇందుకుగాను ఎస్.ఎస్.తమన్ స్పందిస్తూ… “దీంతోపాటు మీమ్స్  చేయడంలో నువ్వు కూడా బిజీగా ఉంటావని నీ భార్యకు చెప్పు.ఆమె నీలాంటి పనికిమాలిన వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని గర్వపడుతుంది” అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తమన్ ” అఖండ”, “గని” సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Also read: పిల్లలు లేకపోవడమే మంచిదైందంటున్న ఇంద్రనీల్ భార్య!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -