Friday, March 29, 2024
- Advertisement -

తెలంగాణలోని తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

- Advertisement -

కరోనా కష్టాల వేళ రాష్ట్ర ప్రజలకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని నిర్ణయించారు. కరోనా సమయంలో చాలా మంది తమ ఉపాది కోల్పోయారని.. ఇంటికే పరిమితం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

కరోనా కట్టడిపై ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సీఎం కేసిఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు సేవలు అందించేందుకు తాత్కలిక పద్దతిన పని చేసేందుకు మొత్తం 50వేల మందిని ఉద్యోగాల్లో నియమించాలని నిర్ణయించారు. తాత్కాలిక వైద్యులతోపాటు పారమెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియన్స్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

ఇక రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్ననేపథ్యంలో, మిగిలిన మరో 80 వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి కూడా వారికి అందిస్తున్న విధంగా 2000 వేల రూపాయాలను 25 కిలోల బియ్యాన్ని అందచేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ప్రైవేట్ టీచర్లకు ఈ కరోనా కష్ట కాలంలో లబ్ధి చేకూరనుంది.

ప్లీజ్ డాక్టర్ బాబు.. ఆ సీరియల్ టైమింగ్స్ మార్చండంటూ రిక్వెస్ట్!

మరోసారి మంచితనం చాటుకున్న అమితాబచ్చన్!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -