Saturday, May 4, 2024
- Advertisement -

మరోసారి ఆ ఖైదీకి భార్యగా నటించనున్న కాజల్..!

- Advertisement -

వెండితెర చందమామగా ఎంతో పేరు సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎన్నో అవకాశాలు దక్కించుకొని వరుస సినిమాలతో బిజీ అయ్యారు. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

పెళ్లి తర్వాత కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ తాజాగా ఓ సినిమాలో ఓ స్టార్ హీరో భార్యగా నటించబోతోందని సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Also read:ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

కాజల్ అగర్వాల్ 2011వ సంవత్సరంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన రోహిత్‌ శెట్టి దర్శకత్వం వచ్చిన సింగం సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అయితే సుమారు 10 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ జోడి వెండితెరపై సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఖైదీ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన అజయ్ దేవగన్ త్వరలోనే ఈ సినిమాను చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒరిజినల్ వెర్షన్ లో హీరోయిన్ పాత్ర ఉండదు. కానీ రీమేక్ సినిమాలో బాలీవుడ్ లో అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేపట్టడంతో హీరోయిన్ పాత్రను పెట్టారని అందులో అజయ్ దేవగన్ భార్యగా ఈ చందమామ నటించబోతోందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాలో కాజల్ పాత్ర గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Also read:రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -