కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యష్. ప్రస్తుతం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్..అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తుండగా యష్ పుట్టినరోజు సందర్భంగా ఓ సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
టక్సెడో, ఫెడోరా డ్రెస్‌లో యష్ ఓ వింటేజ్ కారుని అనుకుని స్టైల్‌గా సిగరెట్ తాగుతున్నారు. అతని అంతులేని ఉనికి మీ అస్తిత్వానికి సంక్షోభం అనే ట్యాగ్ లైన్ ఉండగా పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8 ఉదయం 10 గంటల 25 నిమిషాలకు సర్‌ప్రైజ్‌నిస్తామని ఈ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు దగ్గర పడుతుండటంతో 2025లో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం అభిమానులు సహా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కె.వి.ఎన్.ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు.