యశ్‌తో పూజా హెగ్డే మూవీ

- Advertisement -

కేజీఎఫ్‌ 1,2తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యశ్ తదుపరి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది కన్నడ భావ పూజ హెగ్డే. అయితే నిర్మాతలకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. పూజహెగ్డే మాతృభాష కన్నడ అయినా ఇప్పటివరకు ఈ అమ్మడుకు ఇప్పటివరకు ఒక్క కన్నడ సినిమాలో నటించే ఛాన్స్ దక్కలేదు. తమిళంలో హీరోయిన్‌గా అడుగుపెట్టి.. ఆ తర్వాత తెలుగులో నటించింది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స్టార్‌డమ్ సొంతం చేసుకుంది.

పూజ ఇటీవల నటించిన సినిమాలు ప్లాప్స్ కొడుతున్నా.. ఆమెకు ఏ మాత్రం అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం అన్ని భాషల్లో చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా శాండిల్‌వుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. దర్శకుడు నర్తన్‌తో యశ్ తన తదుపరి సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే ఈ సినిమాలో నటించేందుకు పూజా నిర్మాతలకు చుక్కలు చూపించే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. ఏకంగా ఐదు కోట్లు పారితోషకం ఇవ్వాలని కండీషన్ పెట్టిందట. పూజాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోవడంతో అందుకు నిర్మాతలు అంగీకరించినట్లు సమాచారం. పూజా ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘జనగణమన’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కండిషన్స్ అప్లై అంటున్న లేడీ సూపర్‌ స్టార్

లైసన్స్ లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు !

పవన్ కల్యాణ్ స్థానంలో సత్యదేవ్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -