Friday, March 29, 2024
- Advertisement -

మా అమ్మ ఎదురుగానే ఆ నిర్మాత ఎంతో అసభ్యంగా మాట్లాడాడు:కిష్వర్ మర్చంట్

- Advertisement -

సినిమా ఇండస్ట్రీ అంటేనే హీరోయిన్లకు ఎన్నో అవమానాలు చేదు అనుభవాలు. ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఉన్నారు. ఈ క్రమంలోనే మీటు ఉద్యమం ద్వారా వారికి జరిగిన సంఘటనలను కొందరు తారలు ధైర్యంగా బయటకు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఎందరో తారలు వారి సినీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను ఇదివరకే మీడియా ముందు తెలియజేశారు. తాజాగా మోడల్, నటి కిష్వర్ మర్చంట్ సైతం కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు.

తాజాగా ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె కెరియర్ మొదట్లో తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఒకసారి తన అమ్మతో కలిసి ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అక్కడ ఓ బడా నిర్మాత ఎదురుగా తన తల్లి ఉన్నా, తన సినిమాల్లో నాకు అవకాశం ఇవ్వాలంటే. ఆ హీరోతో గడపాలని అడిగాడు.ఆ సమయంలో నా పక్కన మా అమ్మ ఉంది అనే విషయం గ్రహించకుండా నిర్మాత అంత అసభ్యంగా మాట్లాడటంతో ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెళ్ళిపోయామని, తనకు జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు.

Also read:M Tech పూర్తి చేశా కానీ రూ. 200 సంపాదించా: కెవ్వు కార్తీక్

ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం అయిపోయిందని కిష్వర్ మర్చంట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిర్మాత ఎవరు అని హోస్ట్ అడగగా.. అందరిలానే ఈమె కూడా ఆ నిర్మాత పేరు చెప్పలేదు. హీరో నిర్మాత ఇద్దరూ ఎంతో ప్రముఖులని తెలిపారు. సినిమాలకు దూరం అయి టీవీ సీరియల్స్ లో చేస్తున్న ఈ నటి 2016 డిసెంబర్ 16న నటుడు సుయాష్ రాయ్‌ను వివాహం చేసుకుంది. త్వరలోనే తల్లి కాబోతున్న కిష్వర్‌ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Also read:సినిమా ప్లాప్ అయ్యింది.. మొత్తం డబ్బు మహేష్ బాబు వెనక్కి ఇచ్చి నన్ను కాపాడాడు: నిర్మాత అభిషేక్ నామా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -