Friday, April 26, 2024
- Advertisement -

కృతి శెట్టి చూపు రామ్ చరణ్ వైపు..!

- Advertisement -

కృతి శెట్టి.. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా ’ఉప్పెన’ తో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నా యంగ్ బ్యూటి. మెగా కాంపౌడ్ నుంచి వస్తున్న హీరో కావడంతో అందరి దృష్టి ఉంటుంది. ఈ సినిమాలోని ’నీ కన్ను నీలి సముద్రం’ అన్న ఒక్క సాంగ్ తోనే మంచి క్రేజ్ సంపాంచుకుంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది. అంతేకాదు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి.

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు.. సాయి ధరం తేజ్ తమ్ముడు.. వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా కాబ్బటి సినిమాని బిగ్ స్క్రీన్ లోనే రీలీజ్ కు మొగ్గు చూపుతున్నారు చిత్ర బృందం. ఈసినిమా బుచ్చిబాబు సానా దర్శకత్వం లో సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నారు.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అదిస్తున్నారు.

రీలీజ్ కాకుండానే మంచి క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి వరుస అఫర్‍లు వస్తున్నాయి. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం లో నేచురల్ స్టార్ నాని నటించబోతున్న శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో ఒక హీరోయిన్ సాయి పల్లవి ఉండగా మరో హీరోయిన్ అవకాశాన్ని దక్కించుకుంది. దాంతో పాటు ‌సుధీర్‌ బాబు-ఇంద్రగంటి మూవీలో కూడా హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. అవేకాకుండ మరికొన్ని సినిమాల్లో కూడా కృతి నటించే అవకాశం ఉందట.

కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో.. తెలుగు హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి నేను పెద్ద ఫ్యాన్.. ఆయన నటించిన అన్ని సినిమాలని ఛూచాను. రాం చరణ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. అంటే ఈ బ్యూటి రాంచరణ్ ఫ్యాన్స్ ను తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తుందా… అయితే ఈ అమ్మడు రామ్ చరణ్ టార్గెట్ చేసిందా.. అంటు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకి చరణ్ తో నటించే అవకాశం కృతి శెట్టి దక్కుతుందో లేదో చూడాలి.

ప్రభాస్ కి హీరోయిన్ దొరకడం లేదట..!

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

సుడిగాలి సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

మహేష్ బాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -