ప్రభాస్ కి హీరోయిన్ దొరకడం లేదట..!

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా పరాజయం తర్వాత తాను చేయబోయే సినిమా లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు.. సాహో విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం అయ్యేలా చేసుకోకూడదు అని భావిస్తున్నారు.. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్ ఈ సినిమా ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..

ఇక ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..

- Advertisement -

ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు.. అసలు ఎవరిని తీసుకోవాలా అన్న విషయంపై కూడా చిత్ర యూనిట్ కి క్లారిటీ ఇంకా రాలేదు.. దీపికా పదుకునే ఆల్రెడీ ప్రభాస్-నాగ అశ్విన్ మూవీకి కమిటైపోయింది కాబట్టి ఆ ఛాన్స్ లేదు. పోనీ కియారా అద్వానీని తీసుకుందామంటే బల్క్ డేట్స్ ఎక్కువగా ఇవ్వలేనని చెప్పిందట. అనుష్క శర్మని ట్రై చేద్దామా అంటే తను గర్భవతి. ఇంకో ఏడాది దాకా నటించడం అనుమానమే. నయనతార ఛాయస్ కాదు. జాతీయ మార్కెట్ లో తనకు ఇమేజ్ తక్కువ.  కృతి సనన్ ని అడుగుతున్నట్టు ముంబై టాక్. ఇది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. పెర్ఫార్మన్స్ ని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆషామాషీగా ఎవరినీ తీసుకోలేరు. గ్లామర్ కి ఎక్కువ ప్రధాన్యం ఇచ్చే ఆమెను తీసుకోవడం కొంత రిస్క్ అని చెప్పాలి.. మరి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి..

ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా…?

రాధే శ్యామ్ కి మ్యూజిక్ కొట్టెది ఎవ్వరు..?

రాధే శ్యామ్ లో ఇంకో హీరోయిన్ ఉందా…?

సర్కార్ వారి పాట కు ఓ చిన్న బ్రేక్..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...