Saturday, April 27, 2024
- Advertisement -

మెగా ట్రీట్.. బాస్ వస్తుండు.. గెట్ రెడీ !

- Advertisement -

సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వరుస సినిమాలతో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చిన చిరు… వచ్చే ఏడాది సంక్రాంతి కూడా తనదే అంటున్నారు. ఇక ఈ ఏడాది సమ్మర్ లో వచ్చిన ” ఆచార్య ” బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడంతో ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోయేలా మళ్ళీ దసరాకు ” గాడ్ ఫాదర్ ” తో బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేశారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా తన తదుపరి చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ను వినిపించింది చిత్రయూనిట్. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న MEGA154 మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ ను దీపావళి కానుకగా ఈ నెల 24 న విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. .

అందుకు సంబంధించి అనౌన్స్ మెంట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ మూవీతో వింటేజ్ చిరు ను మళ్ళీ చూస్తారని చిత్రయూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ఇక ఇప్పటికే మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఎట్టి పరిస్థితిలో మూవీని నిలపాలని చిత్రయూనిట్ పట్టుదలగా ఉంది. ఇక ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దాదాపుగా ఇదే టైటిల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. men of masses పేరు పొందిన చిరు.. మళ్ళీ చాలా ఏళ్ల తరువాత పక్కా మాస్ మసాలా చిత్రంలో నటిస్తుండడంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీలో మరో కీలక పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

రాజమౌళి మూవీలో.. మహేశ్ కు విలన్ గా కార్తీ ?

#NTR30 ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమైన ఎన్టీఆర్ ?

“పుష్ప 2 ” ప్లాన్ మొత్తం మారిందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -