Monday, April 29, 2024
- Advertisement -

వీరసింహారెడ్డి గా బాలయ్య.. సరమరసింహారెడ్డి ని గుర్తు చేస్తున్నాడుగా !

- Advertisement -

నట సింహా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పక్క బాలయ్య మార్క్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను చిత్ర యూనిట్ అధికారికంగా రివిల్ చేసింది. బాలయ్య హీరోయిజాన్ని ఎలివేట్ చేసేవిధంగా ఈ మూవీకి ” వీరసింహారెడ్డి ” అంటే టైటిల్ ను కన్ఫర్మ్ చేసింది చిత్రయూనిట్. కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర టైటిల్ లంచ్ ఈవెంట్ చేశారు చిత్రబృందం..

బాలయ్య కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన సమరసింహరెడ్డి మూవీ కి రెండు రెట్లు ఉంటుందంటూ డైరెక్టర్ గోపిచంద్ మలినేని చెప్పుకొచ్చారు. దీంతో ఈ మూవీ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రాయునిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సంక్రాంతికి ప్రభాస్ ఆదిపురుష్, విజయ్ తలపతి ” వారసుడు “, మెగాస్టార్ ” వాల్తేరు వీరయ్య ” మూవీస్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సంక్రాంతి రేస్ లోకి బాలయ్య కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా మారింది. ఇక గతంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బాలయ్య మూవీస్ అదిరిపోయే విజయాలను సొంతం చేసుకున్నాయి. మరి ఈ మూవీతో బాలయ్య ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

బన్నీ, చరణ్ తో భారీ మల్టీ స్టారర్.. పక్కా ?

 బాస్ వస్తుండు.. గెట్ రెడీ !

NTR30 : గెట్ రెడీ టైటిల్ అనౌన్స్ మెంట్.. ఎప్పుడంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -