Saturday, April 20, 2024
- Advertisement -

రాజ‌శేఖ‌ర్ ను సినిమా నుంచి ఎందుకు త‌ప్పించారు ?

- Advertisement -

ఒక‌ప్పుడు హీరోలు మెప్పించిన .. చాలా మంది సీనియ‌ర్ న‌టులు…ప్ర‌స్తుతం విల‌న్లుగా కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. ఈ విష‌యంలో న‌టుడు జ‌గ‌ప‌తి బాబు వంద‌కు వంద‌శాతం మార్కులు కొట్టేశార‌నే చెప్పారు. తాజాగా శ్రీకాంత్ సైతం అఖండ‌తో విల‌న్ గాఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌తి క‌థానాయ‌కుడిగా త‌న‌లోని మ‌రో కోణాన్ని వెలికి తీశాడు. ఇక ఈ జాబితాల్లోకి యాంగ్రీ మ్యాన్‌ రాజశేఖర్‌ కూడా చేరాలనుకున్నాడు.

మంచి అవకాశం వస్తే తాను విలన్‌గా చేసేందుకు సిద్ధం అంటూ ఇప్పటికే స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు చేస్తున్న రాజశేఖర్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ ప్రాజెక్ట్‌లో అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది ఎలాంటి పాత్ర అన్నది క్లారిటీ లేదు. ఇక గోపీచంద్ హీరోగా… శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా రాజశేఖర్‌ ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను నుంచి తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి రాజశేఖర్‌ను మేకర్స్‌ తప్పించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్‌ స్థానంలో జగపతి బాబును తీసుకోనున్న‌ట్లు సమాచారం.

అయితే గోపిచంద్‌ సినిమా నుంచి రాజశేఖర్‌ను తప్పించడానికి కారణమేంటో తెలియదు కానీ, ఆయనకు ఈ ఆఫర్‌ పోవడానికి ఆయన భార్య జీవిత కారణమంటూ కొందరూ అంటున్నారు. ఈ సినిమా రాజశేఖర్‌ పాత్ర విషయంలో జీవిత ఎక్కువగా కలుగ చేసుకుందట. ఈ విషయంలో ఆమె ప్రమేయం నిర్మాతలకు చికాకు తెప్పించిదట. దీంతో గోపించంద్‌-శ్రీవాస్‌ ప్రాజెక్ట్‌ నుంచి రాజశేఖర్‌ను తీసేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ.. విలన్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న రాజశేఖర్‌ ఆశలకు జీవిత విలన్‌ అయ్యిందంటూ కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి.

ప్ర‌భుత్వాన్ని ఢీ కొట్ట‌నున్న జూనియ‌ర్ ఎన్‌టీఆర్

బోయపాటి తర్వాత సినిమా అల్లు అర్జున్‌తో కాదా ?

నెగటివ్‌ రోల్‌లో నాగ చైతన్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -