Friday, March 29, 2024
- Advertisement -

ప్ర‌భుత్వాన్ని ఢీ కొట్ట‌నున్న జూనియ‌ర్ ఎన్‌టీఆర్

- Advertisement -

జూనియ‌ర్‌ ఎన్‌టీఆర్‌ కొమరం భీం పాత్రలో నటించిన‌ ఆర్ఆర్ఆర్ (రౌద్రం, ర‌ణం, రుధిరం) చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా విడుదల కావాల్సి ఉంది. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ సినిమా వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి చిత్రంపై ద్రుష్టి సారించారు తార‌క్‌. ఎన్‌టీఆర్‌ తన 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

గ‌తంలో వీరి కాంబినేషన్ లో వ‌చ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజయం సాధించింది. మ‌రోసారి వీరిద్దరి క‌ల‌యిక‌లో మ‌రో చిత్రం రాబోతుండ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎన్‌టీఆర్‌కు ఇది 30 చిత్రం కావ‌డంతో కొర‌టాల శివ తార‌క్ పాత్ర‌ను ప్ర‌త్యేకంగా తీర్చిదిద్ద‌నున్నాడు. చిత్రానికి సంబంధించిన క‌థ తాజాగా లీకైంది. ప్రస్తుతం దీనిపై ఫిలింన‌గ‌ర్‌లో పెద్ద ఎత్తున చ‌ర్చించుకుటున్నారు.

త‌న ప్ర‌తి చిత్రంలో ఏదో ఒక‌ సామాజిక అంశాన్ని చూపించే శివ ఈ సినిమాలో విద్యావ్యవస్థలోని లోపాల‌ను ఎత్తి చూపే యువ‌కుడిగా, ప్ర‌భుత్వంపై పోరాటే విద్యార్థి నాయ‌కుడిగా తార‌క్‌ను చూపించ‌నున్నారు. గ‌తంలో ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్ 1 చిత్రంలో విద్యార్థిగా నటించాడు. జనతా గ్యారేజ్ చిత్రంలో పర్యారణం కోసం పోరాడే యువకుడిగా నటించాడు. తాజాగా ప్ర‌భుత్వంపై పోరాడే విద్యార్థి నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు.

బోయపాటి తర్వాత సినిమా అల్లు అర్జున్‌తో కాదా ?

ఖిలాడీ డైరెక్టర్‌కు ఓ రేంజ్ గిఫ్ట్

మెన్స్ టాయిలెట్‌లోకి వెళ్లిన హీరోయిన్స్.. అలా చేస్తే తప్పేంటి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -