‘మై విలేజ్ షో’ చానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో అందరికి తెలిసిందే. ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇద్దరు ముగ్గురు బాగా ఫేమస్ అయ్యారు. అందులో గంగవ్వ కూడా ఒకరు. ఈమెకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు గంగవ్వకు బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తెలంగాణ యాసతో ఫుల్ కామెడీ పండించే గంగవ్వకు ఉన్న పాప్యులారిటీ అంతా ఇంతా కాదు. ఈమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అంతేకాకుండా.. సమంత, విజయ్ దేవరకొండ, కాజల్ అగర్వాల్ వంటి వారిని ఇంటర్వ్యూ కూడా చేసింది. బోల్డంత ఫేమ్ సంపాదించుకున్న గంగవ్వకు ఇప్పుడు బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి పిలుపు వచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అయితే, ఈ వార్తపై ‘బిగ్‌బాస్’ నుంచి కానీ, గంగవ్వ నుంచి కానీ ఎటువంటి స్పష్టత లేదు. గత మూడు సీజన్ లో ఇంత వయసున్న వారిని బిగ్ బాస్ కు ఎంపిక చేయలేదు. గంగవ్వే తొలి వ్యక్తి కాబోతోందని ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సురేఖ వాణి కూతురు అప్పుడే తల్లైంది..!
నా ఫోటోలు లీక్ అయ్యాయి.. ఆ బాధ భరించలేనిది : కస్తూరి