కెరీర్ స్టార్టింగ్ లో దేవదాసు, సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో’ వంటీ హిట్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఆ తర్వాత ఈ దర్శకుడు చేసిన సలీం , ఒక్క మగడు , రేయ్ వంటి సినిమాలు భారీగా ప్లాప్ కావడంతో.. ఆయన సినిమా అంటే భయపడే స్థాయికి దిగజారిపోయాడు. అయితే కేవలం దర్శకుడిగానే కాకుండా.. నిర్మాతగా కూడా చేతులు కాల్చుకున్నాడు వైవిఎస్ చౌదరి.
ఈయనను పూర్తిగా మరచిపోయిన సినీ జనాలు మరోసారి నేనున్నాను అంటూ గుర్తు చేసే ప్రయత్నం చేయబోతున్నాడు. అయితే ఈ మధ్య వచ్చిన ఓ వార్త గురించి కూడా.. అయన మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మధ్య తాను ఆత్మహత్యాయత్నం.. చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. తాను అర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్న విషయం నిజమే అయినప్పటికి.. ఆత్మహత్యాయత్నం.. మాత్రం చేయలేదని అన్నారు. తనకు ఆ పరిస్థితి రాలేదని… తనపై వచ్చిన ఈ వార్త రూమర్ అని తెల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
అలానే రేయ్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆయన చేయబోయే సినిమాలో కొత్త హీరో, హీరోయిన్లను తీసుకుంటున్నారట. ప్రస్తుతం నటినటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సబ్జెక్ట్ పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబందించిన పూర్తి వివరాలను తెలియజేస్తారట.