Thursday, May 8, 2025
- Advertisement -

దేశ రాజ‌కీయాల్లో తిరుగులేని ధీశాలి

- Advertisement -
  • ఇందిరాగాంధీ శ‌త జ‌యంతి వేడుక‌లు

దేశాన్ని ఏక‌చ‌త్రాధిప‌త్యంతో ఏలిన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు దేశాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఏలిన ధీశాలి ఆమె. త‌న తండ్రికి కూడా సాధ్యం కాని రీతిలో ప‌రిపాల‌న చేశారు. ఆమె బోడిముఖంతో ఉన్నా వ్య‌క్తిత్వం, మొండిత‌నం, ముక్కుసూటిత‌నం, ధైర్యం, తిరుగులేని శ‌క్తి ఆభ‌ర‌ణాలుగా నిలుస్తూ ఆమెకు నిండుత‌నం తెస్తాయి. అందుకే ఆమెను ఉక్కు మ‌హిళ‌గా వ‌ర్ణిస్తారు. క‌మ‌లా నెహ్రూ, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ముద్దుల కూతురు ఇందిర‌మ్మ. ఆమె 19 న‌వంబ‌ర్ 1917న జ‌న్మించారు. రాజ‌కీయ కుటుంబంలో పుట్టిన ఆమె ఉన్న‌త విద్యావంతురాలు. ఫిరోజ్‌గాంధీని ప్రేమించి వివాహం చేసుకున్నారు. సిల్క్‌ చీరలు, కశ్మీరీ పట్టు, బెనారస్‌ పట్టు చీరలు ధరించి సాధార‌ణ మ‌హిళ‌గా ఉండేవారు. వారికి ఇద్ద‌రు కొడుకులు సంజ‌య్‌గాంధీ, రాజీవ్‌గాంధీ. ప్రధానిగా అధికారం కావాలా, సంజయ్‌కు తల్లిగా ఉంటావా… ఏదో ఒకటి తేల్చుకో అని భర్త ఫిరోజ్‌ అన్నాక ఆమె పిల్లల్ని తీసుకుని నెహ్రూ దగ్గరకు వ‌చ్చింది. వారిద్ద‌రూ విడిపోయారు.

భ‌ర్త‌కు దూర‌మై ప్ర‌జ‌ల‌కు చేరువై ఆమె క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మూడు పర్యాయాలు ప్రధానమంత్రి అయిన మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించారు. తన తండ్రి తరువాత అత్యధిక కాలం పాటు అధికారంలో ఉన్నది ఆమె. 1966 నుంచి 1977 దాకా ప‌రిపాల‌న సాగించింది. ఆత త‌ర్వాత కొంత విరామం వ‌చ్చి మళ్లీ 1980 నుంచి 84 వ‌ర‌కు పరిపాల‌న సాగించారు. చివరకు 1984లో హత్యకు గురయ్యారు. ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ గతిని మార్చేశాయి. కొన్ని విఫ‌లం కాగా మ‌రికొన్ని విజ‌య‌వంత‌మ‌య్యాయి. ఆమె జీవితంలో ఉన్నన్ని మలుపులు, నాటకీయ ఘటనలు, విషాద సంఘ‌ట‌న‌లు రాజ‌కీయ నాయ‌కుల్లో ఎవ‌రికీ లేవు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం, పెళ్లి, భర్తతో విబేధాలు, అధికారం పొంద‌డం, పాకిస్థాన్‌తో యుద్ధం, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి, ఓటమి, గెలుపు, కుమారుడి మరణం, సిక్కు తీవ్రవాదుల చేతుల్లో బలి.. ఈ విధంగా అన్ని మలుపులు ఆమె జీవితంలో ఉన్నాయి. ఆమె శ‌క్తిమంతురాలో అంత వివాదాస్పద వ్యక్తిగా నిలిచారు. నియంతో దేశ సేవలో అంత ప్రజాస్వామ్యవాది.

ఆమె బ్యాంకుల‌ను జాతీయిక‌ర‌ణ చేసింది. ఈ నిర్ణ‌యం దేశానికి, ఆమెకు చాలా క‌లిసొచ్చింది. 14 ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేస్తూ 1969 జూలై 19న ఇందిర నిర్ణ‌యం తీసుకున్నారు. 1971-77 మధ్య కాలం ఇందిర రాజకీయ జీవితంలో కీలకం.. 1971లో పాకిస్థాన్‌ను ఓడించి- తూర్పు పాకిస్థాన్‌ను విడగొట్టి- బంగ్లాదేశ్‌ను ఏర్పరిచినపుడు ఆమె పేరు మార్మోగింది. పాకిస్థాన్‌ పాలకులు తూర్పు ప్రాంత ప్రజలపై విధించిన ఆంక్షలను తట్టుకోలేక దాదాపు 10 లక్షల మంది భారత్‌లోకి శరణార్థులుగా వచ్చేశారు. ఆ వలసను ఆపడానికి ఆమెకు సైనికచర్య తప్ప మరో మార్గం లేకపోయింది. ఆమె జీవితంలో మాయ‌ని మ‌చ్చ అంటే అది 1975-77 మ‌ధ్య కాలం. 1975లో జాతీయ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి విధించింది. ఆమె ప్రతిష్ఠనే కాక దేశానికి కూడా మాయని మచ్చలా మిగిలిపోయింది. రాజ్‌ నారాయణ్‌ వేసిన కేసు ఆమె రాజకీయ జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఇక ఆపరేషన్‌ బ్లూస్టార్‌ (1984) ఆమె మ‌ర‌ణానికే దారి తీసింది. పంజాబ్‌లో వేర్పాటువాదుల్ని అణచడానికి ఆమె ఆ నిర్ణ‌యం తీసుకున్నారు. 1984 జూన్ 5వ తేదీన పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో ఆప‌రేషన్ జ‌రిగింది. ఈ చ‌ర్య చాలా ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. చివ‌రికి ఆప‌రేష‌న్ జ‌రిగిన ఐదు నెలలకు ఇందిరాగాంధీని ఆమె వ్యక్తిగత భ‌ద్ర‌తా సిబ్బంది బియాంత్‌ సింగ్‌, సత్వంత్‌ సింగ్‌ కాల్చిచంపేశారు. ఆమె శరీరంలోకి 33 బుల్లెట్లు దిగబడ్డాయి. ఆవిధంగా ఆమె మ‌ర‌ణం తీవ్రంగా క‌ల‌చివేసింది. ఒక మ‌హాశ‌క్తి శాలి చివ‌రికి హ‌త్య‌కు గుర‌య్యారు. అదేంటో ఆమె కుటుంబం అంతా హ‌త్య‌కు గురైన వారే ఉన్నారు.

పేద‌ల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణ‌యాలు ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు మ‌ర‌చిపోలేదు. ఆమె ఎన్ని నిర్ణ‌యాలు తీసుకున్నాచివ‌రికి దేశం తీసుకున్నార‌నే ప్ర‌జ‌లు క‌ప్పి పుచ్చుతూ ఆమెను అభిమానిస్తూ వ‌స్తున్నారు. ఆ త‌రం ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఆమెను యాది చేసుకుంటూ ఉంటారు. ఇందిర ప‌దం వింటే చాలు ఒక ఊపు మాదిరి ఉండేద‌ని గుర్తుచేసుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -