Monday, April 29, 2024
- Advertisement -

నెహ్రూ అంటే మోడీకి కోపమా.. అసలేంది ఈ రచ్చ !

- Advertisement -

జమ్ము కాశ్మీర్ భారత్ లో విలీనంపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ తో పాటు మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తుంటే.. కమలనాథులు మాత్రం సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ మోడీ ఏమన్నాదంటే.. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక స్వదేశీ సంస్థానాలను భారత్ లో విలీనం చేశారని.. కానీ జమ్ము కాశ్మీర్ లాంటి వాటిని పూర్తిగా భారత్ లో విలీనం చేయడంలో ఒకరు మాత్రం విఫలం అయ్యారని ” పరోక్షంగా జవాహర్లాల్ నెహ్రూ ను ఉద్దేశించి మోడీ ఇటీవల గుజరాత్ లో వ్యాఖ్యానించారు. అయితే మోడీ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పటి పరిస్థితులకు తగినట్లుగానే నెహ్రూ వ్యవహరించి ఉండవచ్చని, అంతమాత్రాన ఒక స్వాతంత్ర్య సమరయోధుడిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పలువురు రాజకీయ వాదులు మోడీ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఇక మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ట్విట్టర్ లో స్పందించారు. ” మహారాజ హరిసింగ్ స్వతంత్రంగా ఉండేందుకే ఇష్టపడ్డాడని.. కానీ పాకిస్తాన్ దాడికి పాల్పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జమ్ము కాశ్మీర్ ను భారత్ లో కలిపేందుకు సిద్దమయ్యాడని ” జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలపై కౌంటర్ గా కేంద్ర మంత్రి కిరణ్ రీజుజూ మరింత ఘాటుగా ట్వీట్ చేశారు. ” స్వాతంత్ర్యానికి నెల రోజుల ముందే 1947 లో మహారాజ సింగ్ నెహ్రూ ను కలిశారని, కానీ నెహ్రూ తన నిర్ణయాన్ని చెప్పకుండా రాజసింగ్ ను తిప్పి పంపారని, అందుకే జమ్ము కాశ్మీర్ విలీనం ఆలస్యమైందని ” కిరణ్ రీజుజూ ట్వీట్ చేశారు. ఇలా ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలు కాశ్మీర్ విషయంలో జవాహర్లాల్ నెహ్రూ వైఖరిని తప్పుబడుతుండడంతో.. మరొకసారి ఈ కాశ్మీర్ అంశం హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -