Monday, April 29, 2024
- Advertisement -

ప్రత్యెక హోదా కుటుంబ వ్యవహారమా ? -శివాజీ

- Advertisement -

ప్రత్యేక హోదా అంటే బిజెపి, టిడిపి ఫ్యామిలీ విషయం కాదని అన్నారు ఏపీ ప్రత్యేకహోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు శివాజీ. ప్రత్యేక హోదా తో ఉద్యోగాలు రావంటున్న సుజనాచౌదరి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక హోదా కోసం శివాజీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

జాబు కావాలంటే ప్రత్యేకహోదా రావాలి అని నినదించే ప్రచార సామాగ్రిని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో శివాజీ, చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు దానిని ప్యాకేజ్ లో ఎందుకు కలిపారని అన్నారు.జాబు కావాలంటే హోదా రావాలనే నినాదాన్ని వినిపించారు.

ప్రత్యేక హోదా ద్వారా ఉద్యోగాలు రావని అన్న సుజనా చౌదరి మాటలను శివాజీ తప్పుబట్టారు.వెంకయ్య నాయుడు కూడా ప్రత్యేక హోదా వలన పన్ను రాయతీలు రావని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Related

  1. షాకింగ్ నిజం : ఏపీ అంటే మోడీ కి కుళ్ళు .. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు
  2. ప్రత్యేక హోదా కోసం పోరాటం
  3. నా కులం తో నాకు సంబంధం లేదు – హీరో శివాజీ
  4. శివాజీ కి ఎందుకంత ఆవేశం ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -